Homeటాప్ స్టోరీస్సైరా తీపి గుర్తులు మరచిపోలేము....

సైరా తీపి గుర్తులు మరచిపోలేము….

sye raa
sye raa

దర్శకులు ‘సురేందర్ రెడ్డి’, నిర్మాత మరియు కథానాయకుడు ‘రామ్ చరణ్‘ అత్యంత భారీ బడ్జెట్ లో తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్ర యోధుడి కథ ఆధారంగా ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవితాన్ని ‘సైరా నరసింహా రెడ్డి’ గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి గారు కూడా సినిమా నాకోసం చేసుకుంటున్న అని చెప్పారు.

రేపు భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న సినిమా గురించి నటించిన నటీనటులు అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. తమిళ, కన్నడ నటీనటులు కూడా సినిమాలో భాగం అవ్వడం వాళ్ళ సినిమా గురించి ప్రమోషన్స్ బాగా జరిగాయి. చిరంజీవి, తమన్నా, రామ్ చరణ్ లు తెగ కష్ట పడుతూ ప్రమోషన్స్ లో బిజీ అవుతున్నారు. బెంగళూరు, చెన్నై, ముంబై లలో సినిమా గురించి ప్రమోషన్స్ చేసి హైదరాబాద్ కి తిరిగి వచ్చారు.

- Advertisement -

అయితే సినిమా గురించి ఇంకా ప్రమోషన్స్ చేయాలి అని చెప్పి ఆన్ లొకేషన్స్ ఫోటోలు పోస్ట్స్ చేసారు కొణిదెల ప్రొడక్షన్ వారు. అందులో విజయ్ సేతుపతి, కన్నడ కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా, జగపతి బాబు, రవి కిషన్ ఇలా అందరూ తమ తమ పాత్రలో ఉన్న ఫొటోస్ ఇప్పుడు మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

రవి కిషన్ కానీ, జగపతి బాబు క్యారక్టర్ కానీ ఈ సినిమాలో చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచే క్యారక్టర్ అని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి చివర వచ్చే 15 నిమిషాల సన్నివేశాలప్పుడు తన గొంతుని మనం వినవచ్చు. స్వీటీ అనుష్క గారు ‘ఝాన్సీ లక్ష్మి భాయి’ పాత్రలో కనిపించబోతున్నారు అని అనుకుంటున్నారు సినిమా వర్గాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All