
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా `ఆది పురుష్` ప్రాజెక్ట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే.
సీక్రెట్‌గా బాలీవుడ్ వర్గాలతో చర్చలు పూర్తి కావడంతో ఈ ప్రాజక్ట్‌ని ప్రభాస్ ఉన్నట్టుండి ప్రకటించడం టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా షాక్ కు గురయ్యారు. ప్రభాస్ లిస్ట్‌లో లేని ఈ ప్రాజెక్ట్ సడన్‌గా ఎలా వచ్చిందని అంతా అవాక్కయ్యారు. అయితే టిసిరీస్ ఓం రౌత్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ వెనక చాలా ట్విస్ట్‌లున్నాయని తెలుస్తోంది.
ప్రభాస్ చేతికి ఈ 400 కోట్ల ప్రాజెక్ట్ చిక్కడానికి చాలా తతంగమే జరిగినట్టు తెలుస్తోంది. శ్రీరాముడి పాత్ర నేపథ్యంలో రామాయగాథని కొంత మేర టచ్ చేస్తూ కొత్త పంథాలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేశారట. ఆ ప్లాన్ ప్రకారమే ముందు ఈ కథని బాలీవుడ్ హీమ్యాన్ హృతిక్ రోషన్‌కి వినిపించారట. హృతికి పెద్దగా ఆసక్తిని చూపించకపోవడంతో ఇదే కథ మరో హీరో వద్దకు వెళ్లిందని సదరు హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి సుముఖతను చూపించకపోవడంతో టిసిరీస్ వారి ద్వారా ఓం రౌత్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రభాస్‌కి వినిపించడం, వెంటనే ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.
చెడుపై మంచి సాధించే విజయం అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని మంగళవారం హీరో ప్రభాస్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లో శ్రీరాముడు, పరశురాముడు, హనుమంతుడు, రావణాసురుడు వంటి పాత్రలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి 2022లో సినిమాని రిలీజ్ చేయాలని టిసిరీస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.