Homeటాప్ స్టోరీస్ఓ పిట్ట కథ మూవీ రివ్యూ

ఓ పిట్ట కథ మూవీ రివ్యూ

ఓ పిట్ట కథ మూవీ రివ్యూ
ఓ పిట్ట కథ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: ఓ పిట్ట కథ
నటీనటులు: సంజయ్ రావ్, నిత్య శెట్టి, విశ్వంత్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: చందు ముద్దు
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
విడుదల తేదీ: మార్చ్ 6, 2020

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఓ పిట్ట కథ. తనకున్న పలుకుబడిని వాడి బ్రహ్మాజీ ఈ చిత్రానికి చేయాల్సినదంతా చేసాడు. సూపర్ స్టార్స్ ను రంగంలోకి దించాడు. మెగాస్టార్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రప్పించాడు. మొత్తానికి ఈ చిత్రంపై బజ్ తీసుకురాగలిగాడు. మరి ట్రైలర్ తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
వెంకట లక్ష్మి (నిత్య శెట్టి) కిడ్నాప్ అవుతుంది. ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి విశ్వంత్, వెంకట లక్ష్మి తండ్రి వస్తారు. ఎస్సై బ్రహ్మాజీ అసలు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో విశ్వంత్ – వెంకటలక్ష్మిల ప్రేమకథ వింటాడు. విశ్వంత్ వెళ్తూ వెళ్తూ ప్రభు (సంజయ్ రావ్) మీద తనకు అనుమానం ఉందని చెబుతాడు. ఇక ఎస్సై ప్రభును విచారించడం మొదలుపెట్టాక వెంకటలక్ష్మితో తనకు కూడా ప్రేమ కథ ఉందని తెలుసుకుంటాడు. ఆ కథ మొత్తం విన్నాక ఎస్సైకు కిడ్నాప్ కు సంబంధించిన క్లూ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మికి ఏమైంది, అసలు ఆమెను కిడ్నాప్ చేసిందెవరు? దేనికోసం చేసారు అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
విశ్వంత్ నటుడిగా ఇప్పటికే పలు సినిమాలు చేసాడు. ఈ చిత్రంలో కూడా అతనికి పలు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర వచ్చింది. నటుడిగా మంచి మార్కులే వేయించుకుంటాడు. నిత్యా శెట్టి కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆమె చూడడానికి కూడా బాగుంది. సంజయ్ రావ్ కు ఇది మొదటి సినిమానే అయినా మెప్పించాడు. ఇంకా ఎమోషన్స్ పండించే విషయంలో మెరుగవ్వాల్సి ఉన్నా తొలి సినిమా కాబట్టి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లే. బ్రహ్మాజీకి ఎస్సైగా కీలక పాత్ర పడింది. అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక పండు పాత్ర విశేషంగా ఆకట్టుకుంటుంది. తనతో పండించిన కామెడీ సినిమాకే హైలైట్. ఇతరులు మాములే.

సాంకేతిక నిపుణులు:
సంగీతం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ సినిమాను ఉన్నతంగా నిలిపాయి. సంగీతం తర్వాత విశేషంగా ఆకట్టుకునేది సినిమాటోగ్రఫీ. ఓ పిట్ట కథలో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బానే ఉంది. అయితే సినిమా బాగా స్లో గా ఉండటం మెయిన్ కంప్లైంట్. డైలాగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. చందు ముద్దు దర్శకత్వం పరంగా మంచి మార్కులే వేయించుకుంటాడు. తనలో విషయముంది.

విశ్లేషణ:
ఓ పిట్ట కథ టైటిల్ కు తగ్గట్లే చిన్నగా మొదలై ట్విస్ట్ లతో కొనసాగుతూ హ్యాపీ ఎండింగ్ కు చేరుకుంటుంది. అయితే ఈ ప్రయాణం స్లో గా ఉంటుందన్న ఒక్క విషయాన్ని పక్కనపెడితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ ఇలా అన్ని విషయాల్లో దర్శకుడు బానే హ్యాండిల్ చేసాడు. మొత్తానికి ఓ పిట్ట కథ ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం.

రేటింగ్: 3/5

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All