Homeటాప్ స్టోరీస్`ఓ పిట్టక‌థ‌` రెగ్యుల‌ర్ సినిమా కాదు: బ‌్ర‌హ్మాజీ

`ఓ పిట్టక‌థ‌` రెగ్యుల‌ర్ సినిమా కాదు: బ‌్ర‌హ్మాజీ

O Pitta katha it's not a regular Movie - brahmaji
O Pitta katha it’s not a regular Movie – brahmaji

సరికొత్త స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న చిత్రం `ఓ పిట్ట‌క‌థ‌`. ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు. స్క్రీన్‌ప్లే చాలా కొత్త‌గా వుంటుంది. రెగ్యుల‌ర్ చిత్రాల్లా అనిపించ‌దు. చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. తెలుగులో ఇంత వ‌ర‌కు ఇలాంటి స్క్రిన్‌ప్లే రాలేదు. క‌థ న‌డుస్తుంటే స్క్రీన్‌ప్లే కూడా చాలా యాంగిల్స్‌లో న‌డుస్తుంది. అంతే కాకుండా ఇందులో చాలా థ్రిల్లింగ్ అంశాలు చాలా వున్నాయి` అన్నారు బ్ర‌హ్మాజీ. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట‌క‌థ‌`. చెందు ముద్దు ద‌ర్శ‌కుడు. విశ్వంత్ యుద్ధ‌న‌పూడి, నిత్యా శెట్టి, సంజ‌య్‌రావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స‌రికొత్త క‌థ‌తో రూపొందిన ఈ చిత్రం ఈ  శుక్ర‌వారం (6న‌) ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.

`ఓ పిట్ట‌క‌థ‌`లోమీ పాత్ర ఎలా వుంటుంది?

- Advertisement -

అమ‌లాపురంలో వుండే ఓ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాను. వెంక‌ట‌ల‌క్ష్మి అనే అమ్మాయి మిస్స‌వువుంది. ఆమె మిస్సింగ్ కేస్‌ని ఛేదించే అధికారిగా నా పాత్ర ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. వెంక‌ట‌ల‌క్ష్మి ఎలా మిస్స‌యింది?.. ఎందుకు మిస్స‌యింది అని ప‌రిశోధించే పాత్ర నాది.

మీకున్న పరిచ‌యాల్ని బాగానే వాడిన‌ట్టున్నారు?

తేదు స‌గ‌మే వాడాను. మొత్తం ఒకే సినిమాకు వాడేస్తే ఎట్టా మిగ‌తా ప‌రిచ‌యాల్ని రెండ‌వ సినిమాకు వాడేస్తాను (న‌వ్వుతూ)

మీ అబ్బాయి సినిమాల్లోకి రావాల‌నుకున్న‌ప్పుడు మీరెమ‌న్నారు?
ప్ర‌య‌త్నించు అన్నాను. స‌క్సెస్ అయితే కంటిన్యూ చెయ్ లేక‌పోతే నీకు న‌చ్చింది చేసుకో అని స‌ల‌హా ఇచ్చాను. ఒక ఫాద‌ర్‌గా ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేయాలో అంత వ‌ర‌కు స‌పోర్ట్ చేశాను. అయితే త‌న‌ని సోలో హీరోగా ప‌రిచ‌యం చేయోచ్చుక‌దా అని మీకు అనిపించొచ్చు. ఒక మంచి క్యారెక్ట‌ర్‌తో సంజ‌య్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌నే ఈ సినిమా చేశాం.

ఇన్నేళ్ల‌యినా ఇంకా యంగ్‌గా ఎలా వుండ‌గ‌లుగుతున్నారు? ఆ ర‌హ‌స్యం ఏంటో చెప్పండి?

ఏమీ లేదు. పాజిటివ్‌గా ఆలోచించ‌డం, పాజిటివ్‌గా వుండ‌టం, న‌లుగురిని నవ్వించడం. వేళ‌కు నిద్ర‌లేవ‌డం. గంట పాటు వ్యాయామం చేయ‌డం. ఇంత‌కు మించి సీక్రెట్ అంటూ ఏమీ లేదు. జీన్స్ ప్ర‌భావం కూడా వుండొచ్చు.

ఇండ‌స్ట్రీలో అంద‌రి హీరోల‌తో అనుబంధాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు?

హీరోలంతా మంచోళ్లే. ఎంత వ‌ర‌కు వుండాలో అంత వ‌ర‌కు వుంటే అంద‌రూ ఆప్తులే అవుతారు.  వాళ్ల మ‌ధ్య ఎలాంటి అపోహ‌లు లేవు. వాళ్ల కోసం మావోడు మావోడంటూ అభిమానులు కొట్టుకుంటుంటారు. కానీ నిజానికి స్టార్స్ వాళ్లు ఊహించిన విధంగా వుండ‌రు. ఒక‌రి ఫంక్ష‌న్‌ల‌కు ఒక‌రు వెళుతుంటారు. అంద‌రి హీరోల మ‌ధ్య బ‌య‌ట అనుకుంటున్న‌ట్టుగా కాకుండా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం వుంది. అంతా మంచి స్నేహితుల్లా వుంటారు. క‌ల‌సి పార్టీలు చేసుకుంటారు.

ఈ సినిమాని అంద‌రితో ప్ర‌మోట్ చేయించారు. ఇంత‌కీ సినిమా చూపించారా?

నా ఫ్రెండ్స్.. డైరెక్ట‌ర్స్‌కి చూపించాను. కృష్ణ‌వంశీ, అనిల్ రావిపూడి, మేర్ల‌పాక గాంధీ, హ‌ను రాఘ‌వ‌పూడి ఇలా ఇండ‌స్ట్రీకి సంబంధించిన చాలా మంది నా వెల్‌విష‌ర్స్ ఈ సినిమా చూసి బాగుంద‌ని అభినందించారు. ముందు నుంచి ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి చెబుతున్నారు. ఆయ‌న స్క్రిన్‌ప్లే విష‌యంలో కొన్ని సూచ‌న‌లు చేశారు. ఫైన‌ల్ కాపీ చూసి బాగుంద‌ని అభినందించారు. ఆయ‌న‌కు న‌చ్చిందంటే సినిమా హిట్టే. అదే నా కాన్ఫిడెంట్‌కి ప్ర‌ధాన కార‌ణం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All