Homeటాప్ స్టోరీస్ఏడాది పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ జై లవకుశ

ఏడాది పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ జై లవకుశ

NTRs Jai Lava Kusa Turns 1యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం ” జై లవకుశ ” సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విడుదలై హిట్ అయిన విషయం తెలిసిందే . గత ఏడాది సెప్టెంబర్ 21 న విడుదలైన జై లవకుశ చిత్రం ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించింది . బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు . ఇక ఈ సినిమాకు రచనా సహకారం అందించిన కోన వెంకట్ ఈ విషయాన్నీ తెలియజేస్తూ అప్పుడే ఏడాది పూర్తయ్యింది , తారక్ విశ్వరూపం చూపించిన సినిమాలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసాడు .

గత ఏడాది నందమూరి హరికృష్ణ షష్ఠి పూర్తి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2న జై లవకుశ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు కానీ సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో సెప్టెంబర్ 2 కి బదులుగా సెప్టెంబర్ 21న విడుదల చేసారు . భారీ వసూళ్లని సాధించింది కానీ రికార్డుల మోత మాత్రం మోగించలేదు . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్నాడు ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: NTRs Jai Lava Kusa Turns 1

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All