Homeటాప్ స్టోరీస్అక్క కోసం ప్రచారానికి వస్తున్న ఎన్టీఆర్

అక్క కోసం ప్రచారానికి వస్తున్న ఎన్టీఆర్

NTR will campaign for suhasiniయంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్క కోసం తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయడానికి వస్తున్నాడు . కొద్దిరోజులుగా ఎన్టీఆర్ అక్క కోసం ప్రచారం చేస్తాడా ? లేదా ? అన్న అనుమానం ఉండేది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్క నందమూరి సుహాసిని కోసం ప్రచారం చేయడానికి రానున్నాడట ! అయితే జక్కన్న దర్శకత్వంలో తాజాగా ఎన్టీఆర్ ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా షూటింగ్ కంటే ఎక్కువగా హోమ్ వర్క్ జరుగుతోంది . సో ఆ పనుల గ్యాప్ లో కూకట్ పల్లి లో ప్రచారం చేయనున్నాడు . ఇంకా పోలింగ్ కు చాలా రోజుల సమయం ఉంది కాబట్టి డిసెంబర్ 5 లోపు తప్పకుండా అక్క కోసం ప్రచారం చేయనున్నాడట ఎన్టీఆర్ .

ఎన్టీఆర్ ఒక్కడే కాదు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సోదరి కోసం తమ్ముడు ఎన్టీఆర్ తో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నాడు . తెలుగుదేశం తరుపున అసలు కళ్యాణ్ రామ్ పోటీ చేయాల్సి ఉంది అయితే కళ్యాణ్ రామ్ నో చెప్పడంతో ఆ స్థానంలో హరికృష్ణ కూతురు ని బరిలో దించుతున్నారు . ఇక సుహాసిని కూకట్ పల్లి లో జోరుగా ప్రచారం చేస్తోంది . ఆమెకు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: NTR will campaign for suhasini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All