Homeటాప్ స్టోరీస్డిసెంబర్ 2న ఎన్టీఆర్ బయోపిక్ టీజర్

డిసెంబర్ 2న ఎన్టీఆర్ బయోపిక్ టీజర్

NTR biopic teaser on december 2nd నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ డిసెంబర్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని 2019 జనవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సినిమా జనవరిలో విడుదల కాబట్టి డిసెంబర్ 2న సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారు .

అలాగే డిసెంబర్ 16న ఆడియో వేడుక నిర్వహించడానికి ప్లాన్ చేస్తునాన్రు . ఈ వేడుకని తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు . బాలయ్య తో పాటుగా విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది దాంతో ఈ సినిమాని కొనడానికి పెద్ద ఎత్తున బయ్యర్లు పోటీ పడ్డారు .

- Advertisement -

English Title: NTR biopic teaser on december 2nd

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All