Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ రైట్స్ కి అన్ని కోట్లా ?

ఎన్టీఆర్ బయోపిక్ రైట్స్ కి అన్ని కోట్లా ?

Mind blowing business for NTR biopic overseas rightsక్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఒక్కో గెటప్ ని ఒక్కోరకంగా రివీల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో బిజినెస్ పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది ఈ చిత్రం . నందమూరి బాలకృష్ణ చిత్రానికి ఓవర్ సీస్ లో పెద్దగా డిమాండ్ ఉండదు . 3 లేదా నాలుగు కోట్లు పలికితే అదే గొప్ప కానీ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ఎంతకు పోయిందో తెలుసా ……. 20 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ రెండు పార్ట్ లు కలిపి 20 కోట్లకు బేరం కుదిరినట్లు తెలుస్తోంది . అంటే అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్న వాళ్ళతో పోల్చితే చాలా ఎక్కువ . అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి కారణం ఎన్టీఆర్ బయోపిక్ పై ఉన్న క్రేజ్ ఒక కారణం కాగా మరో కారణం ఏంటో తెలుసా …….. ఎన్టీఆర్

- Advertisement -

అవును ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు కాబట్టి ఆయన చరిత మరోసారి ఇప్పటి తరానికి కూడా తెలియాలి కాబట్టి అలాగే ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతీ భారతీయుడికి , అందునా ప్రతీ తెలుగువాడికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవం కాబట్టి అంతటి సాహసం చేసారు . భారీ రేటుకి కొన్నప్పటికి అది రికవరీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట . జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతుంది . రెండో పార్ట్ కూడా జనవరిలోనే అనుకుంటున్నారు కానీ ఏమైనా మార్పులు ఉండొచ్చు అని తెలుస్తోంది .

 

English Title: Mind blowing business for NTR biopic overseas rights

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts