Homeటాప్ స్టోరీస్`స‌లార్‌` త‌రువాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఎవ‌రితో?

`స‌లార్‌` త‌రువాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఎవ‌రితో?

`స‌లార్‌` త‌రువాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఎవ‌రితో?
`స‌లార్‌` త‌రువాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఎవ‌రితో?

క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్` తో పాన్ ఇండియా స్థాయి ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయారు. దేశ వ్యాప్తంగా ఈ మూవీతో క్రేజ్‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం `కేజీఎఫ్‌`కు సీక్వెల్‌గా రూపొందుతున్న `కేజీఎఫ్‌2`ని తెర‌కెక్కిస్తున్న ఆయ‌న ప్ర‌భాస్‌తో `స‌లార్‌` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

అయితే ఈ మూవీ త‌రువాత ప్రశాంత్ నీల్ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న ఎన్టీఆర్ తో త‌న నెక్స్ట్ మూవీని చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే మైత్రీ మూవీమేక‌ర్స్ వ‌ద్ద ప్ర‌శాంత్ నీల్ భారీ మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ న్యూస్‌ని మైత్రీ సంస్థ వెల్లడించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది పూర్త‌యిన త‌రువాత త్రివిక్ర‌మ్ చిత్రానికి డేట్స్ కేటాయించాల్సి వుంటుంది. దాని త‌రువాతే ప్ర‌శాంత్ నీల్ చిత్రాన్ని మొద‌లుపెట్టే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All