Homeటాప్ స్టోరీస్చంద్రబాబు ని కలిసిన ఎన్టీఆర్

చంద్రబాబు ని కలిసిన ఎన్టీఆర్

Ntr team meet ap cm chandrababuఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసింది ఎన్టీఆర్ టీమ్ . నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించనున్నాడు దాంతో అతడ్ని తీసుకొని బాలయ్య దర్శకుడు క్రిష్ చంద్రబాబు ని కలిశారు నిన్న . ఎన్టీఆర్ కు బాబు చిన్నల్లుడు అన్న విషయం తెలిసిందే . దానికి తోడు బాబు క్యారెక్టర్ ని తప్పకుండా మిగతా అల్లుళ్ళ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ పాత్రకు రానా ని ఎంచుకున్నారు క్రిష్ , బాలయ్య .

రానా పోషించేది చంద్రబాబు పాత్ర కాబట్టి ఏపీ సీఎం ని కలిశారు మర్యాద పూర్వకంగా . ఆ భేటీ లో పలు విషయాలు చర్చకు వచ్చాయట !అలాగే తన పాత్ర తీరుతెన్నులపై చర్చించిన బాబు రానా ని ప్రోత్సహించడమే కాకుండా సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించాడట . బాబు ని కలిసిన అనంతరం నిమ్మకూరు వెళ్లాలని నిర్ణయించుకున్నారట ఎన్టీఆర్ బృందం . అక్కడ పలు పరిసరాలను పరిశీలించి రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారు . ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తికాగా ఈనెలలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది . ఎన్టీఆర్ బయోపిక్ అప్పుడే జాతీయ స్థాయిలో చర్చ సృష్టిస్తోంది . దాంతో భారీ ఆఫర్ లు వచ్చి పడుతున్నాయి కానీ బాలయ్య మాత్రం అప్పుడే సినిమాని అమ్మాలని అనుకోవడం లేదు .

- Advertisement -

English Title: ntr team meet ap cm chandrababu

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All