HomeVideosఅర్ధరాత్రి ఎన్టీఆర్ ..చరణ్ కారు ఎక్కి వెళ్లేవాడట..

అర్ధరాత్రి ఎన్టీఆర్ ..చరణ్ కారు ఎక్కి వెళ్లేవాడట..

NTR Shares Charan Birthday Celebrations
NTR Shares Charan Birthday Celebrations

ఒకప్పుడు నందమూరి అభిమానులకు, మెగా అభిమానులకు అస్సలు పడేది కాదు..ఇరు అభిమానులు కనిపిస్తే కొట్టుకునేంతగా ఉండేవారు..కానీ ఇప్పుడు అంత మారిపోయింది. ఏ హీరో సినిమా వచ్చినసరే ఇరు అభిమానులు కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని అనుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ ఇరు ఫ్యామిలీల నుండి ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించడం..మరికొద్ది రోజుల్లో రాబోతుండడం తో అభిమానుల ఎదురుచూపులు అంత ఇంత కాదు. ఇక వారెవరో..ఏ సినిమా గురించి చెపుతున్నామో చెప్పాల్సిన పనిలేదు.

ఎస్ ..ఆర్ఆర్ఆర్ గురించే చెపుతున్నాం. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ మూవీ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెపుతూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా అనిల్ రావిపూడి తో చిట్ చాట్ లో పాల్గొన్న ఇద్దరు అనేక విషయాలు పంచుకున్నారు.

- Advertisement -

మేమిద్దం చాలా మంచి ఫ్రెండ్స్‌. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా, అలా మేమిద్దరం కలిసిపోయాం. మార్చి 26న నా భార్య లక్ష్మీప్రణతి బర్త్‌డే. మార్చి 27న చరణ్‌ బర్త్‌డే. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి. ఎవరికీ తెలియని విషయమేంటంటే.. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు నేను గేటు దగ్గర ఉండేవాడిని, చరణ్‌ కారు రాగానే అందులో ఎక్కేసి వెళ్లిపోయేవాడిని. ప్రణతి ఫోన్‌ చేసి ‘నా బర్త్‌డే, నువ్వెక్కడున్నావ్‌?’ అంటే పన్నెండు దాటింది, నీ బర్త్‌డే అయిపోయింది అని చెప్పేవాడిని’ అంటూ చరణ్‌ పుట్టినరోజును ఎలా సెలబ్రేట్‌ చేసుకునేవారో ఎన్టీఆర్ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All