Homeటాప్ స్టోరీస్భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్న ఎన్టీఆర్

భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్న ఎన్టీఆర్

Ntr rejected srinivasa kalyanamయంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ డిజాస్టర్ నుండి తెలివిగా తప్పించుకున్నాడు , లేకపోతే మొహమాటం కొద్దీ ఆ సినిమా చేసి ఉంటే తప్పకుండా డిజాస్టర్ ఆదుకునేవాడు . ఇంతకీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా ……. …… శ్రీనివాస కళ్యాణం . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు . శతమానం భవతి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు దిల్ రాజు అంతేకాదు ఎన్టీఆర్ కు ఫోన్ చేసి సతీష్ వచ్చి కథ చెబుతాడని చెప్పాడట ! దాంతో ఎన్టీఆర్ కథ వినడానికి సమయం ఇచ్చాడు .

సతీష్ వేగేశ్న చెప్పిన కథ విన్నాక ఎన్టీఆర్ ఈ సినిమా చేయకపోవడమే మంచిదని భావించి తనకు సెట్ కాదని తప్పుకున్నాడట ! ఎన్టీఆర్ నో చెప్పడంతో ఇదే కథ ని మరో ఇద్దరు హీరోలకు కూడా చెప్పారట అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు కానీ అక్కడ కూడా సెట్ కాలేదు దాంతో నితిన్ వద్దకు వెళ్ళింది . దిల్ రాజు – నితిన్ ల కాంబినేషన్ లో ఎప్పుడో దిల్ అనే సినిమా వచ్చింది అది సూపర్ హిట్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో నితిన్ సినిమా చేయలేదు అందుకే ఒప్పుకున్నాడు కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది ఫ్లాప్ అయ్యింది . ఒకవేళ మొహమాటం తో ఎన్టీఆర్ సినిమా చేసి ఉంటే డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకునే వాడు కానీ తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది .

- Advertisement -

English Title: ntr rejected srinivasa kalyanam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All