Homeటాప్ స్టోరీస్అప్పుడు 2009లో.. ఇప్పుడు 2019లో.. తారక్ కు తెలుసా?

అప్పుడు 2009లో.. ఇప్పుడు 2019లో.. తారక్ కు తెలుసా?

అప్పుడు 2009లో.. ఇప్పుడు 2019లో.. తారక్ కు తెలుసా?
అప్పుడు 2009లో.. ఇప్పుడు 2019లో.. తారక్ కు తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా ప్లాప్ అయినా రెండో సినిమా స్టూడెంట్ నెం 1తో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇక అక్కడి నుండి ఎన్టీఆర్ వెనుతిరిగి చూసింది లేదు. 19 ఏళ్ల కెరీర్ లో 28 సినిమాలు చేసాడు తారక్. ఈ 28 సినిమాల్లో ఎన్నో విజయాలు, పరాజయాలు, సూపర్ హిట్స్, డిజాస్టర్స్ ఇలా అన్నీ చూసాడు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ లో అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా ఐదు సినిమాలు సక్సెస్ సాధించాడు. 2001 నుండి ప్రతి ఏడాది తన సినిమా ఉండేలా జాగ్రత్త పడ్డాడు ఎన్టీఆర్. కొన్ని సార్లు అయితే ఏడాదికి రెండు సినిమాలు కూడా చేసాడు. సినిమాల విషయంలో మిగతా టాప్ హీరోలతో పోల్చితే ఎన్టీఆర్ ఎప్పుడూ వేగంగానే సినిమాలు చేస్తూ వచ్చాడు.

అయితే కేవలం రెండే రెండు సార్లు ఈ 19 ఏళ్లలో ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. మొదటిసారి 2009లో కాగా, రెండోది 2019లో. ఆ దశాబ్దం చివర్లో, ఈ దశాబ్దం చివర్లో ఎన్టీఆర్ సినిమాలు విడుదల కాకపోవడం యాదృచ్చికమా లేక కావాలని తీసుకున్న నిర్ణయమా అన్నది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. కంత్రి సినిమా ఊహించని ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఓకే చేయడానికి బాగా టైమ్ తీసుకున్నాడు. 2010లో అదుర్స్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే ఏడాది బృందావనం సినిమాతో మరో మరపురాని విజయం సాధించాడు.

- Advertisement -

ఈసారి 2018లో అరవింద సమేత చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండడంతో కొన్ని నెలలు విరామం తీసుకుని దానికి సమాయత్తమయ్యాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా మేకింగ్ కు టైమ్ పడుతుంది కాబట్టి 2019లో ఎన్టీఆర్ నుండి సినిమా విడుదల లేదు. 2020లో మళ్ళీ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలా రెండు సార్లు 2009లో, 2019లో ఎన్టీఆర్ సినిమా లేకపోవడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All