Homeగాసిప్స్ఎన్టీఆర్ వాళ్ళను నమ్మట్లేదా?

ఎన్టీఆర్ వాళ్ళను నమ్మట్లేదా?

ఎన్టీఆర్ వాళ్ళను నమ్మట్లేదా?
ఎన్టీఆర్ వాళ్ళను నమ్మట్లేదా?

జూ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఇంతవరకూ 28 సినిమాలు చేసాడు కానీ ఇప్పటివరకూ ఒక్క పరభాషా దర్శకుడితో పనిచేయలేదు. 28 సినిమాలకూ దర్శకులు తెలుగువాళ్లే. మొదటినుండి తెలుగు దర్శకులతో చేయడానికే ఎన్టీఆర్ మొగ్గుచూపాడు. తనతో సినిమాలు చేయడానికి చాలా మంది తమిళ దర్శకులు ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. మురుగదాస్, అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కథ నచ్చక కాదు కానీ ఎన్టీఆర్ ఎందుకనో పరభాషా దర్శకులపై ఎక్కువ ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించి లీకైన స్టిల్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ 2020 సెప్టెంబర్ కల్లా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అవుతాడని చూచాయిగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై ఆసక్తి నెలకొంది. ముందు చెప్పినట్లుగా అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఎన్టీఆర్ ను కలిసి కథ కూడా చెప్పారు కానీ మన యంగ్ టైగర్ మాత్రం చేయలేనని చెప్పేసాడు. దీనికి కారణం తెలుగు అభిమానుల అభిరుచిని సరిగ్గా అంచనా వేయడంలో పరభాషా దర్శకులు వరసగా విఫలమవుతున్నారు. అందుకనే ఈ విషయంలో అసలు రిస్క్ తీసుకోవట్లేదు ఎన్టీఆర్. టెంపర్ నుండి మొదలుపెట్టి ఎన్టీఆర్ సినిమాల ఎంపికలో చాలా పరిణితి చూపిస్తూ వస్తున్నాడు. వరసగా ఐదు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -

ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయడానికే ఎన్టీఆర్ పట్టుదలగా ఉన్నాడు. అందుకే ప్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా తీస్తామని చెబుతున్నా కానీ ఎన్టీఆర్ వాళ్లకు ఓకే చెప్పట్లేదు. ఆర్ ఆర్ ఆర్ తర్వాతి సినిమా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కన్ఫర్మ్ చేసాడు ఎన్టీఆర్. ఇప్పటికే అరవింద సమేత చిత్రంతో వీళ్లిద్దరి జోడి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పీరియాడిక్ డ్రామా తర్వాత ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నాడు. ఆ విధంగా త్రివిక్రమ్ ను కథ సిద్ధం చేయమని కోరాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All