Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ

ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ

ntr mahanayakudu movie review
ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ

ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ :
నటీనటులు : నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్ , కళ్యాణ్ రామ్ , రానా
సంగీతం : కీరవాణి
నిర్మాతలు : వసుంధరాదేవి – బాలకృష్ణ
దర్శకత్వం : క్రిష్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2019

 

- Advertisement -

తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు , మహా నాయకుడు నందమూరి తారకరామారావు బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు ఈరోజు రిలీజ్ అయ్యింది , అయితే ఈ చిత్ర ప్రీమియర్ షో నిన్న రాత్రి వేశారు . ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన మొదటి భాగం ఎన్టీఆర్  కథానాయకుడు జనవరిలో రిలీజ్ అయి ప్లాప్ అయ్యింది . మరి ఈ రెండో భాగమైనా హిట్ అవుతుందా ? ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? చూద్దామా !

కథ :

తెలుగునాట తిరుగులేని స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ( నందమూరి బాలకృష్ణ ) తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి ఎలా తీసుకొచ్చాడు . దేశ ప్రధాని ఇందిరమ్మ ని ఎలా ఎదిరించాడు , నాదెండ్ల భాస్కర్ రావు ( సచిన్ ఖేడ్ కర్ ) కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్టీఆర్ ని ఎలా పదవీచ్యుతుడిని చేసాడు ? ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎన్టీఆర్ చేసిన పోరాటం ఏంటి ? మళ్ళీ ప్రజల అండతో ఎలా ముఖ్యమంత్రి కాగలిగాడు  అన్నదే ఎన్టీఆర్ మహానాయకుడు కథాంశం .

హైలెట్స్ :

నందమూరి బాలకృష్ణ

విద్యాబాలన్

రానా

సచిన్ ఖేడ్ కర్

కళ్యాణ్ రామ్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

నందమూరి తారకరామారావు పాత్రలో మరోసారి నందమూరి బాలకృష్ణ మెప్పించాడు . కొన్ని సన్నివేశాలలో అయితే ఎన్టీఆర్ నే తలపించాడు తన నటనా కౌశలంతో . మొదటి పార్ట్ లో కొన్ని సన్నివేశాల్లో బాలయ్య మెప్పించలేదు కానీ రెండో పార్ట్ లో మాత్రం ఎన్టీఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడనే చెప్పాలి . విద్యాబాలన్ బసవతారకం పాత్రలో జీవించింది . ముఖ్యంగా బాలయ్య – విద్యాబాలన్ ల మధ్య సన్నివేశాలు మహిళా ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయం . చంద్రబాబు నాయుడు పాత్రలో రానా సరిగ్గా సరిపోయాడు . ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండో పార్ట్ లో హీరో అనే చెప్పాలి . చంద్రబాబు చాణక్యం ఎలా ఉంటుందో మచ్చుకి కొన్ని సన్నివేశాలు చూపించారు . ఇక కళ్యాణ్ రామ్ పాత్ర కూడా బాగుంది హరికృష్ణ పాత్రలో మెప్పించాడు . సచిన్ ఖేడ్ కర్ నాదెండ్ల పాత్రకు సరిగ్గా సరిపోయాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

ఎం ఎం కీరవాణి అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి . జ్ఙాన శేఖర్ విజువల్స్ బాగున్నాయి . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే ……. ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యం మాత్రమే కాకుండా బసవతారకం తో ఉన్న అనుబంధాన్ని కూడా చూపించి మంచి ప్రయత్నం చేసాడు . అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా క్రిష్ ఈసారి మంచి ప్రయత్నమే చేసాడు విజయం సాధించాడు .

ఓవరాల్ గా :

ఎన్టీఆర్ మహానాయకుడు తప్పకుండా ఓసారి చూడొచ్చు .

English Title: ntr mahanayakudu movie review

Click here for English Review

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All