Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి ఏంటి ?

ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి ఏంటి ?

No buzz on NTR mahanayakudu ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ ఈనెల 22న కానీ ఆ  ప్రమోషన్స్ మాత్రం చేపట్టడం లేదు ఆ చిత్ర బృందం . ఎన్టీఆర్ జీవితకథ అంటూ సాగిన ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కింది . జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది , సినిమా బాగోలేదని టాక్ మాత్రం రాలేదు కానీ వసూళ్లు మాత్రం నాసిరకంగా వచ్చాయి . ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోకపోవడంతో ఖంగుతిన్నారు మేకర్స్ .

 

- Advertisement -

ముఖ్యంగా బాలయ్య , క్రిష్ . దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని అలాగే రిలీజ్ చేయకుండా కొన్ని మార్పులు చేసి రీ షూట్ చేసారు . ఈనెల 22 న రిలీజ్ చేస్తున్నారు . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం చేపట్టడం లేదు బాలయ్య కానీ క్రిష్ కానీ . ఏదో సినిమా చేసాం కాబట్టి రిలీజ్ చేస్తే అదే పదివేలు అన్నట్లుగా తయారయ్యింది ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి . ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రభంజనం సృష్టిస్తోంది అయితే ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు .

English Title: No buzz on NTR mahanayakudu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All