Homeగాసిప్స్డిసెంబర్ నుండి 30వ చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న ఎన్టీఆర్

డిసెంబర్ నుండి 30వ చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న ఎన్టీఆర్

డిసెంబర్ నుండి 30వ చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న ఎన్టీఆర్
డిసెంబర్ నుండి 30వ చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పూర్తి చేసాడు. అలాగే హోస్ట్ గా చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు తొలి సీజన్ కూడా పూర్తయింది. దీంతో తన కమిట్మెంట్స్ నుండి ఎన్టీఆర్ ఫ్రీ అవుతున్నాడు. ఇక కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనున్న ఎన్టీఆర్ ఆ తర్వాత తిరిగి బిజీగా మారనున్నాడు. తన 30వ చిత్రాన్ని మొదలుపెట్టాలి. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని ఎన్టీఆర్ చేయనున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ లోనే లాంచ్ కావాలి కానీ వివిధ కారణాల వల్ల జాప్యమవుతూ వచ్చింది.

అలాగే హీరోయిన్ గా అలియా భట్ ను అనుకుంటున్నారు. ఆమె డిసెంబర్ నుండి డేట్స్ ఇస్తానని చెప్పినట్లు సమాచారం. అలియా భట్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆర్ ఆర్ ఆర్ లో కూడా అలియా భట్ నటించిన విషయం తెల్సిందే. మరోవైపు ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ కోసం ప్రమోషన్స్ చేపట్టాలి. నవంబర్ సెకండ్ వీక్ నుండి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ఊపందుకుంటాయని సమాచారం.

- Advertisement -

అటు ఎన్టీఆర్, ఇటు అలియా భట్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తే డిసెంబర్ నుండి కొరటాల శివ సినిమా మొదలవుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All