
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందన్న రూమర్స్ ఈ మధ్యనే మొదలయ్యాయి. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా అలియా భట్, రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా చేసిన విషయం తెల్సిందే. సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ వస్తుందో రాదో ఇంకా తెలీదు కానీ అలియా భట్ చిత్రం మాత్రం సంక్రాంతికి వస్తోంది.
అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన గంగూభాయ్ కథైవాడి చిత్రం జనవరి 6, 2022న విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసారు. బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. గంగూభాయ్ కథైవాడిలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించాడు. ఆర్ ఆర్ ఆర్ లో కూడా అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గురువుగా కనిపిస్తాడు.
మరి అలియా భట్ చిత్రం జనవరి 6న విడుదలవుతుండగా, ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతికి వస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.