Homeటాప్ స్టోరీస్భీమ్ కోసం శ్ర‌మిస్తున్న యంగ్‌టైగ‌ర్‌!

భీమ్ కోసం శ్ర‌మిస్తున్న యంగ్‌టైగ‌ర్‌!

భీమ్ కోసం శ్ర‌మిస్తున్న యంగ్‌టైగ‌ర్‌!
భీమ్ కోసం శ్ర‌మిస్తున్న యంగ్‌టైగ‌ర్‌!

యంగ్‌టైగ‌న్ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్ప‌డంతో దిట్ట‌. పేజీల‌కు పేజీలున్నా స‌రే సింగిల్ టేక్‌లో చెప్ప‌గ‌ల‌గ‌డం ఎన్టీఆర్ ప్ర‌త్యేక‌త‌. దీనికి `య‌మ దొంగ` చిత్రం లో ఎన్టీఆర్ చెప్పే `ఎనీ డౌట్‌…` డైలాగ్ చిన్న ఎగ్జాంపుల్‌. అయితే ఎన్టీఆర్ తెలుగులోనే కాదు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ డైలాగ్‌లు చెప్ప‌గల‌డ‌ని `ఆర్ ఆర్ ఆర్‌` ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌తో నిరూపించారు.

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్ వీడియోని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. రామ్‌చ‌ర‌ణ్ విజువ‌ల్స్‌ని ఎన్టీఆర్ వాయిస్ ఎలివేట్ చేసింద‌ని అంతా ప్ర‌శంసించారు. ఇదే వీడియోకు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఎన్టీఆరే వాయిస్ ఓవ‌ర్ అందించారు.

- Advertisement -

అయితే మ‌ల‌యాళంలో మాత్రం చెప్ప‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయిన ఎన్టీఆర్ ఆన్‌లైన్ మ‌ల‌యాళ పాఠాలు నేర్చు‌కుంటున్నార‌ట‌. త‌న ఆత్ర‌కు మ‌ల‌యాళంలోనూ తానే డ‌బ్బింగ్ చెప్పాల‌ని ఎన్టీఆర్ శ్ర‌మిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అంటే మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ భీమ్ లుక్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All