Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఫ్యాక్షన్ గెటప్ ఫోటో లీక్

ఎన్టీఆర్ ఫ్యాక్షన్ గెటప్ ఫోటో లీక్

ntr faction getup leakedఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ” అరవింద సమెత ” వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఫ్యాక్షన్ లీడర్ గా ఉన్న ఫోటో ఒకటి లీకయ్యింది . ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . అయితే ఈ ఫోటోలో ఎన్టీఆర్ కనబడుతున్నప్పటికీ క్వాలిటీ మాత్రం లేదు , షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో దొంగచాటుగా తీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఎన్టీఆర్ కత్తి పట్టిన ఫోటో సంచలనం సృష్టించగా ఇటీవలే నాగబాబు తో పాటు ఎన్టీఆర్ వాహనంలో వెళ్తున్న ఫోటో లీకై యూనిట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది .దాంతో లొకేషన్ లోకి సెల్ ఫోన్ లు , ట్యాబ్ లు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ఫోటోలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా లు నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు – నాగబాబు లు నటిస్తున్నారు . ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: ntr faction getup leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All