Homeటాప్ స్టోరీస్రికార్డుల వేట మొదలుపెట్టిన ఎన్టీఆర్

రికార్డుల వేట మొదలుపెట్టిన ఎన్టీఆర్

NTR eyes on non baahubali recordsనాన్ బాహుబలి రికార్డులను అన్నింటినీ బద్దలు కొడుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . నిన్న విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది . నిన్న ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో తెలుసా …… 33 కోట్ల షేర్ . అవును ఒక్క రోజులోనే 33 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించి నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసాడు ఎన్టీఆర్ . ఈరోజు శుక్రవారం , రేపు శనివారం , ఎల్లుండి ఆదివారం దాంతో లాంగ్ వీకెండ్ దొరికింది ఎన్టీఆర్ కు దానికి మిగతా రోజులు కూడా దసరా సెలవులు కాబట్టి మొదటి వారంలోనే బయ్యర్లందని లాభాల్లోకి తీసుకెల్లనున్నాడు ఎన్టీఆర్ .

రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా ఒక్క రోజులోనే 26 కోట్లకు పైగా షేర్ వచ్చింది . అలాగే ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , అన్ని కలిపి 33 కోట్ల షేర్ రాబట్టింది అరవింద సమేత. దసరా సెలవులు కాబట్టి , సినిమాకు టాక్ బాగా వచ్చింది కాబట్టి ఇక రికార్డుల మోతలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది . ఈలెక్కన చూస్తే నాలుగు రోజుల్లోనే వంద కోట్ల షేర్ రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తానికి రికార్డుల వేట మొదలు పెట్టాడు ఎన్టీఆర్ . అవలీలగా 130 కోట్ల కు పైగా షేర్ వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే .

- Advertisement -

English Title: NTR eyes on non baahubali records

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All