Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ - చరణ్ ల మద్య యుద్ధం మొదలైంది

ఎన్టీఆర్ – చరణ్ ల మద్య యుద్ధం మొదలైంది

NTR -CHARAN films regular shooting starts with action sequenceఎన్టీఆర్చరణ్ ల మద్య భీకరమైన యుద్ద సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతమైన అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ ఫైటింగ్ సీన్ తీస్తున్నాడు జక్కన్న . దాని కోసం భారీ ఎత్తున యూనిట్ సిద్దమైంది . తాజాగా ఎన్టీఆర్ , చరణ్ లతో కలిసి సెట్ లో ఫోటో దిగిన జక్కన్న ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు . ఇటీవలే భారీ ఎత్తున ప్రారంభమైన ఈ ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది .

ఇక రెగ్యులర్ షూటింగ్ ఎన్టీఆర్ – చరణ్ ల మద్య పోరాట దృశ్యాలతో ప్రారంభం అవుతుండటం విశేషం . ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్ లో ఉండటం గమనార్హం . ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు కాగా కీర్తి సురేష్ ని కన్ఫర్మ్ చేసారు . అలాగే చరణ్ సరసన కైరా అద్వానీ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట . కీర్తి సురేష్ అయితే కన్ఫర్మ్ అయ్యింది ఎన్టీఆర్ పక్కన . ఇక మరో హీరోయిన్ ని బాలీవుడ్ లేదా హాలీవుడ్ నుండి తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు జక్కన్న . ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ పరిశీలనలో ఉంది .

- Advertisement -

English Title: NTR -CHARAN films regular shooting starts with action sequence

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All