Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో మారిపోయింది.. రీజన్ ఏంటి?

ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో మారిపోయింది.. రీజన్ ఏంటి?

ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో మారిపోయింది.. రీజన్ ఏంటి?
ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో మారిపోయింది.. రీజన్ ఏంటి?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఈ సంక్రాంతికి వచ్చి మరో ప్లాప్ ను అందుకున్నాడు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు 118 తప్ప మిగతావన్నీ ప్లాపులుగా మిగిలాయి. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన ఎంత మంచివాడవురా కూడా ప్లాపవ్వడంతో కళ్యాణ్ రామ్ తన తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ యాక్టివ్ గా ఉన్న విషయం తెల్సిందే. తాను హీరోగా తెరకెక్కే సినిమాలే కాకుండా గతంలో రవితేజతో కిక్ 2 తీసిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో జై లవకుశ తీసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమాకు హారిక అండ్ హాసిని సంస్థతో పాటు కళ్యాణ్ రామ్ బ్యానర్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కూడా ఒక నిర్మాణ భాగస్వామి. ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ సరిగ్గా గమనిస్తే ఒక విషయం అర్ధమవుతుంది. అదే ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో మారిపోయింది. ఇదివరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో తెలుగులో చేతివ్రాతతో ఉన్నట్లు ఉండేది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పేరు కానీ ఉండేది. అయితే ఈ చిత్ర అనౌన్స్మెంట్ సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్ లో రాసారు. అది కూడా చేతివ్రాతతో రాసినట్లు కాకుండా మాములుగా ఉంది. అందులో ఇంగ్లీష్ అక్షరాలు n, t, r ని హైలైట్ అవుతున్నాయి. అందులోనూ లోగో పక్కన ఎన్టీఆర్, బసవతారకం గార్లు కలిసున్న ఫోటోను వేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క ఎన్టీఆర్ ఫోటోని మాత్రమే వాడారు. వెనకాల ఆయన షాడో పడుతున్నట్లుగా కూడా ఉంది.

- Advertisement -

మరి లోగో మార్పు వెనకాల, ఫాంట్ మార్పు వెనకాల కారణమేంటో మాత్రం తెలియలేదు. కేవలం సెంటిమెంట్ ప్రకారమే ఈ విధంగా ఫాలో అయ్యారా లేక మరేదేమైనా కారణముందా అన్నది తెలియాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All