Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ షాడో లుక్ అదరహో

ఎన్టీఆర్ షాడో లుక్ అదరహో

ntr aravinda sametha gets teaser release date and timeయంగ్ టైగర్ ఎన్టీఆర్ షాడో లుక్ లో అదరహో లెవల్లో ఉన్నాడు . ఆగస్టు 15న ఉదయం 9 గంటలకు టీజర్ ని వదలబోతున్నామని అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం ఎన్టీఆర్ షాడో లుక్ ని రిలీజ్ చేసారు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ” అరవింద సమేత ” వీర రాఘవ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది ఇక ఈషా రెబ్బా కూడా కీలక పాత్ర పోషిస్తోంది . నాగబాబు , జగపతిబాబు కూడా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు .

ఇప్పటికే పలు స్టిల్స్ లీక్ అయి సినిమాపై అంచనాలు పెంచగా ఇక టీజర్ తో మరింతగా అంచనాలు పెంచాలని చూస్తున్నారు . స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . త్రివిక్రమ్ కు ఈ సినిమా తప్పకుండా విజయాన్ని ఇవ్వాలి ఎందుకంటే అజ్ఞాతవాసి చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు . ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు . అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . టీజర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు రోజుల్లో తేలిపోనుంది .

- Advertisement -

English Title: ntr aravinda sametha gets teaser release date and time

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All