Homeటాప్ స్టోరీస్నందమూరి కళ్యాణ్ రామ్ ఏమైపోయాడు?

నందమూరి కళ్యాణ్ రామ్ ఏమైపోయాడు?

నందమూరి కళ్యాణ్ రామ్ ఏమైపోయాడు?
నందమూరి కళ్యాణ్ రామ్ ఏమైపోయాడు?

ఈరోజులల్లో ఏ చిత్రానికైనా ప్రమోషన్స్ అనేవి అత్యవసరం. ఇదివరకంటే సినిమాలు వందేసి రోజులు ఆడేవి కాబట్టి మౌత్ టాక్ తో సినిమాలు పికప్ అయ్యేవి. గోడమీద పోస్టర్ చూసి కూడా సినిమాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా లైఫ్ ఒక వీకెండ్ కు వచ్చేసింది. బాగుందంటే మరో రెండు వీకెండ్స్ వరకూ రన్ ఉంటుంది. కానీ మాగ్జిమమ్ రెవిన్యూ తొలి వీకెండ్ లోనే రాబట్టుకోవాలి. అంటే ఎక్కువ శాతం ప్రేక్షకులు సినిమాను తొలి వారాంతంలోనే చూసేయాలి. అంత మంది ప్రేక్షకులు మొదటి మూడు రోజుల్లోనే చూడాలంటే జనాల్ని ఆకర్షించడం అత్యవసరం. దాని కోసం ప్రమోషన్స్ ను దంచి కొట్టాలి.

ఈ సూత్రాన్ని బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడో ఔపోసన పెట్టేసారు. ఫస్ట్ కాపీ, సినిమా విడుదలకు నెల ముందే రెడీగా పెట్టుకుంటారు. సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి ఏదొక రకంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. కానీ టాలీవుడ్ ఈ విషయంలో ఇంకా వెనుకబడే ఉంది. కథల ఎంపికలో, చిత్రీకరణ విషయంలో బాలీవుడ్ తో సమానంగా ఉన్న టాలీవుడ్, ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది.

- Advertisement -

అయితే అల వైకుంఠపురములో వంటి ఒకట్రెండు చిత్రాలు తప్ప ప్రమోషన్స్ యొక్క ప్రాధాన్యతను ఇంకా టాలీవుడ్ గుర్తించలేదు. దీనికి ఉదాహరణగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఎంత మంచివాడవురాను ప్రస్తావించుకోవచ్చు. ఇది మీడియం బడ్జెట్ సినిమా. సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు వంటి బడా సినిమాలతో ఢీ కొట్టనుంది. ప్రమోషన్స్ నిజానికి వాళ్ళ కన్నా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకే ఎక్కువ అవసరం. అలాంటిది అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో దూడుకుపోతుంటే ఎంత మంచివాడవురా మాత్రం చడీ చప్పుడు చెయ్యట్లేదు. దసరాకి టీజర్ వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు దీపావళికి సంక్రాంతి సినిమాలన్నీ ఏదొక అప్డేట్ తో రెడీగా ఉంటే ఎంతమంచివాడవురా మాత్రం సైలెంట్ గా ఉండడం ఏమిటో అర్ధం కావడం లేదంటున్నారు విశ్లేషకులు.

పండగలకు ప్రోమోస్ రిలీజ్ చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఎంత మంచివాడవురా ఈ అవకాశాన్ని దీపావళికి ఉపయోగించుకోకపోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేం. మరి ఇంకా సమయం ఉంది కాబట్టి ఏదైనా పోస్టర్ తోనైనా సరిపెడతారేమో చూడాలి. దీని తర్వాతైనా సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని కోరుకుంటున్నారు.

సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది. గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ తొలిసారి నిర్మాణంలోకి ఈ చిత్రం ద్వారా అడుగుపెడుతోంది. కుటుంబ బంధాలతో మంచివాడుగా పెరిగిన వ్యక్తి అదే కుటుంబం జోలికి వస్తే ఎలా రియాక్ట్ అయ్యాడన్న కథాంశం నేపథ్యంలో ఎంత మంచివాడవురా తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 15 నుండి ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All