Homeటాప్ స్టోరీస్కళ్యాణ్ రామ్ ను పట్టించుకోరేంటి?

కళ్యాణ్ రామ్ ను పట్టించుకోరేంటి?

కళ్యాణ్ రామ్ ను పట్టించుకోరేంటి?
కళ్యాణ్ రామ్ ను పట్టించుకోరేంటి?

ప్రస్తుతం ఎక్కడ చూసినా డిస్కషన్ మాత్రం సంక్రాంతి సినిమాల గురించే ఉంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఒకే రోజు హడావిడిగా ఎందుకు విడుదల తేదీలు ప్రకటించాయి, దీని వల్ల కలిగే నష్టాలేంటి? ఎందుకని ఈ రెండు చిత్రాలూ ఆదివారం విడుదలనే కోరుకుంటున్నాయి. వెంకీ మామ సడెన్ గా ఎందుకు సంక్రాంతి రేసులోకి వచ్చింది? వెంకీ మామ రావడం వల్లే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఒకే రోజు రావడానికి ఫిక్స్ అయ్యాయా?

అసలు దర్బార్ పరిస్థితేంటి? దిల్ రాజు రెండు రోజుల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాడా? ఇలా భిన్న రకాలైన డిస్కషన్స్ అందరిదగ్గరా జరుగుతున్నాయి. కానీ వీరందరికంటే ముందు సంక్రాంతికి వస్తున్నా అని ప్రకటించిన నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ఒక్క డిస్కషన్ కూడా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

- Advertisement -

వెంకీ మామ సంక్రాంతికి విడుదలైతే ఆ రెండు పెద్ద సినిమాలు ఎలా ఇంపాక్ట్ అవుతాయి అని డిస్కస్ చేసుకుంటున్నారు కానీ నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది మాత్రం పట్టించుకోవట్లేదు. నిజానికి ఎంత మంచివాడవురా టీజర్ తో ఆకట్టుకుంది. అయినా కూడా సంక్రాంతి సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All