
బన్నీ కోసం దర్‌శకుడు సుకుమార్ మరో హీరోయిన్‌ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. `పుష్ప` పేరుతో ఊర మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
శేషా చలం అడువుల్లో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరో `రంగస్థలం` అనిపించే స్థాయిలో రూపొందిస్తున్నారు. నల్లమల అడవుల్లో ముందు ఈ చిత్ర తాజా షెడ్యూల్‌ని ప్రారంభించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆ షెడ్యూల్‌ని వాయిదా వేశారు. ప్రస్తుత క్రైసిస్ సద్దుమనిగిన తరువాతే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే స్క్రిప్ట్ ప్రకారం ఇందులో మరో హీరోయిన్ వుందట. ఆ పాత్ర కోసం నివేదా థామస్‌ని ఎంపిక చేసినట్టు తెలిసింది. పేరుకి రెండవ హీరోయిన్ అయినా నివేద పాత్ర కీలకంగా వుంటుందని తెలిసింది. ఇటీవల రజనీ నటించిన `దర్బార్` చిత్రంలో రజనీకి కూతురిగా కీలక పాత్రలో నివేదా నటించిన విషయం తెలిసిందే. `పుష్ప` చిత్రంలో బన్నీకి లవర్‌గా నివేద కనిపిస్తుందని తెలిసింది.