Homeటాప్ స్టోరీస్`పాగ‌ల్‌`కు జోడీగా నివేదా పేతురాజ్‌!

`పాగ‌ల్‌`కు జోడీగా నివేదా పేతురాజ్‌!

Nivetha pethuraj in Vishwak sens Pagal
Nivetha pethuraj in Vishwak sens Pagal

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. `హిట్‌` చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న విశ్వ‌క్‌సేన్ ఈ మూవీతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా బ్యాన‌ర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని గురువారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అంతే కాకుండా తీరా అనే క్యారెక్ట‌ర్ పేరుతో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ని ప‌రిచ‌యం చేసింది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో విశ్వ‌క్‌సేన్ త‌న రెండు చేతులు వెన‌క్కి క‌ట్టేసి వుండే టీష‌ర్ట్‌, ఫ్రాక్ ధ‌రించి అత‌న్ని హ‌గ్ చేసుకుంటున్న నివేదా క‌నిపిస్తోంది.

- Advertisement -

పోస్ట‌ర్ చూస్తుంటే నివేదా పేతురాజ్‌తో `పాగ‌ల్‌`కు మ‌రింత గ్లామ‌ర్‌ని యాడ్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. నివేదా కూడా పోస్ట‌ర్‌లో మ‌రింత రొమాంటిక్‌గా క‌నిపిస్తోంది. పాగ‌ల్‌ని క‌ట్టి ప‌డేసే ప్రేమికురాలిగా త‌ను ఇందులో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీని మే 1న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All