Homeటాప్ స్టోరీస్నివేతా, రెజీనా లీడ్ రోల్ లో శాకిని డాకిని

నివేతా, రెజీనా లీడ్ రోల్ లో శాకిని డాకిని

నివేతా, రెజీనా లీడ్ రోల్ లో శాకిని డాకిని
నివేతా, రెజీనా లీడ్ రోల్ లో శాకిని డాకిని

టాలీవుడ్ లో ఫేమ్ సంపాదించిన హీరోయిన్లు నివేతా థామస్, రెజీనా కాసాండ్రా లీడ్ రోల్స్ లో కలిసి నటించారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి సంబంధించిన ప్రకటన రీసెంట్ గా విడుదలైంది. దీనికి శాకిని డాకిని అనే ఆసక్తికర టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. నివేత థామస్ పుట్టినరోజు సందర్భంగా దాన్ని అధికారికంగా అనౌన్స్ చేసారు. యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ చిత్ర అధికారిక రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. శాకిని డాకిని అనేవి భారతదేశంలో ఎక్కువగా దెయ్యాలకు ఉపయోగించే పేరు. కొంచెం కామిక్ వే లో వాడుతుంటారు అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదే టైటిల్ తో చిత్రం రూపొందింది. ఈ సినిమా నివేతా థామస్, రెజీనా కాసాండ్రాలు పోలీసులుగా కనిపిస్తారు.

- Advertisement -

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రమోషన్స్ ను కూడా మొదలుపెడతారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం త్వరలో విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All