
మలయాళ భామ నిత్యామీనన్ నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . నెటిజన్ల పై నిత్యామీనన్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. తనని అకారణంగా దూషించడమే ! ఇటీవల కేరళ ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే , అయితే ఆ వరదల గురించి , కష్టాలపాలైన ప్రజల గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు కానీ తన సినిమాలకు సంబంధించి , ఇతర వాటి పై మాట్లాడుతూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిత్యామీనన్ .
దాంతో వరదలతో అల్లాడుతున్న ప్రజానీకం గురించి పట్టించుకోలేదు కానీ ఇలా స్టైల్ గా ఫోటోలు పెట్టడం ఏంటి ? బాధితులను ఆదుకునేది ఉందా ? లేదా ? అంటూ నిత్యామీనన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు నెటిజన్లు . దాంతో చిర్రెత్తుకొచ్చిన నిత్యా వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది .
- Advertisement -