Homeటాప్ స్టోరీస్నితిన్ మేస్ట్రో: ట్యూన్ అవ్వట్లేదు, పియానో పనిచేయట్లేదు!!

నితిన్ మేస్ట్రో: ట్యూన్ అవ్వట్లేదు, పియానో పనిచేయట్లేదు!!

నితిన్ మేస్ట్రో: ట్యూన్ అవ్వట్లేదు, పియానో పనిచేయట్లేదు!!
నితిన్ మేస్ట్రో: ట్యూన్ అవ్వట్లేదు, పియానో పనిచేయట్లేదు!!

యంగ్ హీరో నితిన్ నెక్స్ట్ సినిమా మేస్ట్రో డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబోతోంది. డిస్నీ + హాట్ స్టార్ లో ఈ చిత్రం సెప్టెంబర్ 17 నుండి స్ట్రీమ్ అవుతుంది. మేస్ట్రో బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మేస్ట్రోలో నితిన్ అంధుడిగా కనిపిస్తాడు. నభ నటేష్ హీరోయిన్ గా నటించగా తమన్నా నెగటివ్ రోల్ పోషించింది.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి చిన్న వీడియో బిట్ ను ఈరోజు విడుదల చేసారు. ఈ వీడియోలో నితిన్ పియానో వాయిస్తూ ఉండగా ఒక పిల్లి వస్తూ ఉంటుంది. అయితే పియానో మధ్యలో ఆగిపోతుంది. “మళ్ళీ రిపేర్ ఆ, ట్యూన్ కంప్లీట్ అవ్వట్లేదు, పియానో కూడా” అని అంటాడు నితిన్.

- Advertisement -

శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా మేర్లపాక గాంధీ దీన్ని డైరెక్ట్ చేసాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో కూడా నిరాశనే ఎదుర్కొన్న నితిన్ మరి ఈ చిత్రంతోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All