Homeటాప్ స్టోరీస్తీవ్రవాదిగా, చెస్ ప్లేయర్ గా నితిన్

తీవ్రవాదిగా, చెస్ ప్లేయర్ గా నితిన్

తీవ్రవాదిగా, చెస్ ప్లేయర్ గా నితిన్
తీవ్రవాదిగా, చెస్ ప్లేయర్ గా నితిన్

యంగ్ హీరో నితిన్ విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. గతేడాది భీష్మతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ నటించిన రంగ్ దే చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మార్చ్ 26న రంగ్ దే చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

నితిన్ హీరోగా నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ చిత్రాన్ని చేస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో ఉరిశిక్ష పడ్డ జీవిత ఖైదుగా కనిపించనున్నాడు నితిన్.

- Advertisement -

అలాగే నితిన్ మంచి చెస్ ప్లేయర్ అనే విషయం కూడా టీజర్ లో చూపించారు. అటు టెర్రరిస్ట్ అంటూ ఇటు చెస్ ప్లేయర్ అంటూ మంచి లింకే పెట్టారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్, నితిన్ ను అమాయకుడు అని అడగడం, తనకు ఏ పాపం తెలియదు అని చెప్పడం కాన్ఫ్లిక్ట్ పాయింట్.

ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All