Homeటాప్ స్టోరీస్అప్పుడు “ఆశా పాశం..!” – “ఇప్పుడు నింగి చుట్టే..!”

అప్పుడు “ఆశా పాశం..!” – “ఇప్పుడు నింగి చుట్టే..!”

అప్పుడు “ఆశా పాశం..!” – “ఇప్పుడు నింగి చుట్టే..!”
అప్పుడు “ఆశా పాశం..!” – “ఇప్పుడు నింగి చుట్టే..!”

ఈ రెండు పాటలు వింటున్నప్పుడు మనకు “ఒక రోజెళ్ళిపోయింది” కథ గుర్తుకువస్తుంది. ఈ కథ శంకరమంచి సత్యం గారు రాసిన “అమరావతి కథలు” పుస్తకం లో ఉంటుంది. పిచ్చయ్య గారు అనే ఒక వ్యక్తి చక్కగా.. పొద్దున్నే లేచేవాడు. కృష్ణలో స్నానం చేసేవాడు. అమరేశ్వర స్వామికి అభిషేకం చేసేవాడు. తన భార్యవండిన భోజనం చేసేవాడు. సాయంత్రం ఒక నలుగులు స్నేహితులను కలిసి ఇంటికి వచ్చి పడుకునే వాడు. అలా పడుకునేవాడు ఒక రోజు మళ్ళీ లేవలేదు (శివైక్యం చెందారు). అలా అతి సామాన్యంగా, ఏ తప్పు చెయ్యకుండా, ఎవరితో గొడవ పడకుండా బ్రతకడం అంత తేలికా.? అస్సలు కాదు కదా..!

ప్రస్తుతం 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “నింగి చుట్టే..!” అనే పాట కూడా అలా ఒక సామాన్యుడైన, సాత్వికుడైన వ్యక్తి ఉమా మహేశ్వర రావు అనే ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ గురించి చెప్తూనే, మనలాంటి కోట్లమంది సామాన్యుల జీవితాలు ఎంత గొప్పవో.? మనకు తెలియచేస్తోంది.

- Advertisement -

నింగి చుట్టే లోకం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా

మెదలదు నీ మీదోట్టు

కాలం కదలికలతో జోడికట్టు

తొలిగా

తారవాసలా వూసులను వీడి చూసింది ఓ సారి సగటుల కనికట్టు

తమదేదో తమదంటు మితిమీరా తగదట్టు

తమదైనా తృణమైన చాలను వరస

ఉచితాన సలహాలు పగలేని కలహలు

యనలేని కథనాల చొటిది బహుశా

సిసలైన సరదాలు పడిలేచే పయనాలు

తరిమేసి తీమిరాలు నడిచెలే మనస

విసుగేది దరిరాని వీథిరాత కదిలిని

శతకోటి సహనాల నడవడి తెలుసా

గతంలో ఇదే దర్శకుడు తీసిన “కేరాఫ్ కంచెర్ల పాలెం” సినిమాలో “ఆశా పాశం బందీ సేసేలే..!” పాట రాసిన విశ్వా గారు నిజంగా మళ్ళీ ఈ పాట ద్వారా సాహిత్య ప్రియుల హృదయాలను సుసంపన్నం చేసారు. ఈ పాటను ఇంత అద్భుతంగా స్వరపరిచిన మ్యూజిక్ డైరెక్టర్ బిజిబల్ గారు మరియు పాడిన విజయ్ జేసుదాస్ గారు అంతా కలిసి మళ్ళీ ఒక 10 ఏళ్ళు గుర్తుండిపోయే పాట ఇచ్చారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All