Homeటాప్ స్టోరీస్“ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” టీజర్ విడుదల

“ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” టీజర్ విడుదల

“ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” టీజర్ విడుదల
“ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” టీజర్ విడుదల

“వాడిని తిరిగి కొట్టేంత వరకూ… ఈ ఊళ్ళో నేను చెప్పులు వేసుకోను..!” అని శపధం చేసిన ఫోటోగ్రాఫర్ ఉమామహేశ్వర రావు ఇప్పుడు ఏకంగా, తనను కొట్టిన వాడి మీదకు కొట్టడానికి వెళ్ళిపోయాడు. “కేరాఫ్ కంచెరపాలెం” డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ లో సత్యదేవ్ నటన ప్రధానమైన హైలెట్. “మహేష్… ఉమామహేశ్వర రావు గారూ..!” అనే పిలుపుతో మొదలైన టీజర్ లో హీరో, హీరోయిన్ ను కలవడం, అరకు లాంటి చిన్న పల్లెటూరులో ప్రజలను మన హీరో… చిన్ డౌన్, ఐస్ ఓపెన్, స్మైల్ అని ఫోటోలు తీయడం చూపించారు.

ఇక సాధారణ పల్లెటూరు అమాయకుడైన ఫోటోగ్రాఫర్ గా, సత్యదేవ్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆయన కెరియర్ బెస్ట్ ఫిలిం అని చెప్పవచ్చు. ఇక పెద్ద నరేష్ గారు మరొక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. TNR, జబర్దస్త్ రామ్ ప్రసాద్, చాయ్ బిస్కెట్ సుహాస్ ఇలా అందరూ బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ బిజిబల్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ నిజంగానే మనకు అరకు పల్లెటూరు ఫీల్ ను చూపిస్తోంది. ఇక పలు హిట్ సినిమాలకు పనిచేసిన ఎడిటర్ రవితేజ గిరిజాల గారి వర్క్ ఈ సినిమాకు మరొక ఎసెట్. “మహేశాంతే ప్రతీకారం” అనే మలయాళం సినిమా ఈ సినిమాకు మూలం.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All