Homeటాప్ స్టోరీస్ఉచిత విద్య పథకంతో విద్యార్థులకు ఆపన్న హస్తం అందించనున్న సోను సూద్

ఉచిత విద్య పథకంతో విద్యార్థులకు ఆపన్న హస్తం అందించనున్న సోను సూద్

ఉచిత విద్య పథకంతో విద్యార్థులకు ఆపన్న హస్తం అందించనున్న సోను సూద్
ఉచిత విద్య పథకంతో విద్యార్థులకు ఆపన్న హస్తం అందించనున్న సోను సూద్

నటుడు సోను సూద్ గతేడాది కరోనా మొదలైన సమయం నుండి ఎన్ని రకాలైన సహాయ కార్యక్రమాలు చేపట్టాడో లెక్కే లేదు. వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడం, విదేశాల్లో ఇరుక్కున్న విద్యార్థులను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో సహా చాలా మందికి సహాయం చేసాడు. అలాగే సూద్ ఫౌండేషన్ ను స్థాపించి తన సహాయాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు.

తాజాగా ప్రొఫెసర్ సరోజ్ సూద్ స్కాలర్ షిప్స్ పేరిట అవసరమైన విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి సిద్ధమయ్యాడు. ఈ స్కాలర్ షిప్ పేరిట అవసరమైన విద్యార్థులు 100కు పైగా కోర్సుల్లో ఉచిత విద్య ప్రోగ్రామ్ లో అప్లై చేసుకునే అవకాశముంది.

ఈ స్కాలర్ షిప్ లో భాగంగా నిమ్స్ యూనివర్సిటీ, మానవ్ రచన, PIITR నోయిడా, సిటీ యూనివర్సిటీ, బుద్ధ కాలేజ్ మొదలగు యూనివర్సిటీలలో ఉచిత విద్య కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం https://soodcharityfoundation.org/prof-saroj-sood-scholarships/ కు వెళ్లి అక్కడ అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్ షిప్ ప్యాన్ ఇండియాది కావడం విశేషం.
- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All