Homeటాప్ స్టోరీస్సోను సూద్ పై విషప్రచారం... నిజమెంత?

సోను సూద్ పై విషప్రచారం… నిజమెంత?

సోను సూద్ పై విషప్రచారం... నిజమెంత?
సోను సూద్ పై విషప్రచారం… నిజమెంత?

రియల్ హీరో, దేవుడు ఈరోజు ఈ పదాలకు సరిగ్గా సరిపోయే పేరు అంటే కచ్చితంగా సోను సూద్ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ విధించగా వలస కార్మికులు, విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఎంతలా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన సమయంలో సోను సూద్ తానున్నాను అని ముందుకొచ్చాడు. వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చాడు.

అక్కడ నుండి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో అయితే సోను సూద్ సహాయం మరింత పీక్ స్టేజ్ కు చేరుకుంది. మందులు కావాలంటే మందులు, డబ్బులు కావాలంటే డబ్బులు, ఆక్సిజన్ కావాలంటే అది, హాస్పిటల్ లో బెడ్ దొరక్కపోతే అరేంజ్ చేయించడం.. ఇలా ఒకటేమిటి సోను సూద్ సహాయాలు ప్రభుత్వాలను మించి పోయాయి.

- Advertisement -

గతేడాది సోను సూద్ ను ఎవరూ ప్రశ్నించలేదు కానీ ఈ ఏడాది మాత్రం అతనికి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. సోను సూద్ వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని, లేకపోతే ఇంత డబ్బు, పలుకుబడి అతనికి ఎలా సాధ్యమయ్యాయి అని అంటున్నారు. ప్రభుత్వాలపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా సోను సూద్ పాపం టార్గెట్ అవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All