Homeటాప్ స్టోరీస్గాసిప్స్ పై నిప్పులు చెరుగుతున్న నిహారిక

గాసిప్స్ పై నిప్పులు చెరుగుతున్న నిహారిక

niharika konidela fire on gossipsమెగా డాటర్ నిహారిక తనపై వస్తున్న గాసిప్ లపై ఆగ్రహంగా ఉంది , నిప్పులు చెరుగుతోంది కూడా . నా పెళ్లి ఎప్పుడు ? ఎవరితో ? అన్న విషయాలు మీకెందుకు ? అది నా స్వవిషయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . పని పాటా లేనివాళ్లు అదేపనిగా ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారని ఫైర్ అవుతోంది . అయితే గాసిప్ లపై నిహారిక నిప్పులు చెరిగేది నిజమే అయినప్పటికీ , ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసేది మాత్రం ఓ సినిమా కోసం మాత్రమే సుమా ! తాజాగా ఈ భామ ” హ్యాపీ వెడ్డింగ్ ” చిత్రంలో నటిస్తోంది .

యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తుండగా హీరోగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నాడు . ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థ ఈ హ్యాపీ వెడ్డింగ్ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను మరింతగా పెంచడానికి ఈ గాసిప్ ఐటెం ని వాడుకున్నారు ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు నిహారిక పై పలు గాసిప్ లు వచ్చాయి . హీరో ప్రభాస్ తో నిహారిక పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి వాటిని ఖండించింది , హీరో నాగశౌర్య సరసన ఒక మనసు చిత్రంలో నటించడంతో ఆ హీరో తో నిహారిక ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి దాంతో అప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మరీ ఖండించింది . అలా గాసిప్ లు ఎక్కువ కావడంతో ఇప్పుడు అదే గాసిప్ ని ఎంచుకొని హ్యాపీ వెడ్డింగ్ పై అంచనాలు పెంచడానికి ఈ ప్రయత్నం చేసారు . మరి ఈ ప్రయత్నంతో నైనా మెగా డాటర్ హిట్ కొడుతుందో చూడాలి ఎందుకంటే మొదటి సినిమా ఒక మనసు డిజాస్టర్ అయ్యింది కాబట్టి .

- Advertisement -

English Title: niharika konidela fire on gossips

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All