Homeటాప్ స్టోరీస్మాల్దీవుల్లో నిశ్చ‌య్ జోడీ హ‌ల్‌చ‌ల్‌!

మాల్దీవుల్లో నిశ్చ‌య్ జోడీ హ‌ల్‌చ‌ల్‌!

మాల్దీవుల్లో నిశ్చ‌య్ జోడీ హ‌ల్‌చ‌ల్‌!
మాల్దీవుల్లో నిశ్చ‌య్ జోడీ హ‌ల్‌చ‌ల్‌!

మాల్దీవులు సెల‌బ్రిటీల వెకేష‌న్‌ల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారాయి. లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి మాల్దీవుల్లో విహ‌రిస్తూ హంగామా చేసే స్టార్ సెల‌బ్రిటీల జాబితా పెరిగిపోతూనే వుంది. బాలీవుడ్‌, హాలీవుడ్ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ అక్క‌డి దీవుల్లో వెకేష‌న్‌ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ జంట నిహారిక‌, చైత‌న్య చేరారు. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల వివాహం ఈ నెల 9న గుంటూరు ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. రాజ‌స్థాన్‌లో ఉద‌య్‌పూర్‌లోని ఉద‌య్ విలాస్‌లో నిహారిక‌, చైత‌న్య‌ల వివాహం డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హాలో జ‌రిగింది.

- Advertisement -

ఈ వెడ్డింగ్‌లో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ , స్టార్ హీరోలంతా పాల్గొని సంద‌డి చేశారు. పెళ్లి త‌రువాత కొత్త జంట నిహారిక‌, జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. నూతన వధూవరులు మాల్దీవెవుల్లో విహ‌రిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటూ ఆనందిస్తున్నారు. ప్ర‌స్తుతం నిశ్చ‌య్‌ల జోడీకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All