Homeటాప్ స్టోరీస్యాక్షన్ కింగ్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ

యాక్షన్ కింగ్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ

యాక్షన్ కింగ్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ
యాక్షన్ కింగ్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ

సాధారణంగా మన హీరోలు తమ నట వారసులుగా కొడుకులను, అల్లుళ్ళను, తమ్ముళ్ళను ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యడం చూస్తూ ఉంటాం. కొద్దిమంది మాత్రమే తమ నట వారసత్వానికి కొనసాగింపుగా తమ కూతుర్లను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తారు. “లోకనాయకుడు” కమల్ హాసన్ తన ఇద్దరు కూతుర్లను (శృతి హాసన్, అక్షర హాసన్) లను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. టాలీవుడ్ లో హీరో రాజశేఖర్ గారు కూడా ఈ మధ్యనే తన కూతుర్లను సినిమా ఇండస్ట్రీ లో ప్రోత్సహిస్తున్నారు. బాలీవుడ్ లో సైతం నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు పిల్లలను (జాహ్నవి, ఖుషి) లను హీరోయిన్స్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. ఇప్పుడు ఆ జాబితాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా చేరారు. తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం అటు తమిళ, తెలుగు, కన్నడ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రత్యేకించి విలన్స్ కొరత బాగా ఉన్న, సౌత్ లో అర్జున్ ఒక మంచి ఆప్షన్ అవుతున్నారు. నితిన్ నటించిన “లై”, విశాల్ నటించిన “ఇరుమ్బుతెరై” లలో విలన్ గా ఆయన నటన ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది. అల్లు అర్జున్ గత చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ” లో కూడా హీరో తండ్రి క్యారక్టర్ లో కనిపించారు యాక్షన్ కింగ్. అదే విధంగా సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ ఉంటారు అర్జున్. తన ప్రాణ మిత్రుడు జగపతి బాబు తో చేసిన హనుమాన్ జంక్షన్ సినిమా నుండి ఇటీవల తాలా అజిత్ తో చేసిన “మంగతా” (తెలుగు లో గ్యాంబ్లర్) సినిమాలే ఇందుకు ఉదాహరణ. కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన “శ్రీ ఆంజనేయం” సినిమాలో హనుమంతుడి పాత్ర వేసిన అర్జున్ నిజజీవితంలో కూడా రామ భక్తుడే. ఇప్పుడు ఒక భారీ ఆలయ నిర్మాణం కూడా చేస్తున్నారు మన యాక్షన్ కింగ్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All