Homeటాప్ స్టోరీస్రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ - మున్నా కాశీ

రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ – మున్నా కాశీ

New Star Of Tollywood Munna Kasi
New Star Of Tollywood Munna Kasi

వెంకట సూర్య నారాయణ మూర్తి అంటే పెద్దగా తెలియదు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మున్నా కాశీ అంటే టాలీవుడ్ లో మనందరికీ సుపరిచితుడు. 2012 స్వర్గీయ S.V రంగారావు గారి మనవడు హీరోగా పరిచయం అయిన Mr.7 సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యారు. గతంలో మా టీవీ వారు నిర్వహించిన పలు కార్యక్రమాలకు సంగీతం అందించారు. ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన “యాక్షన్ – 3D” సినిమాలో మున్నా కాశీ చేసిన సంగీతం పెద్ద హిట్ అయ్యింది. ఆ సమయంలోనే మున్నా కు హీరోగా ఛాన్స్ లు వచ్చినా, రొటీన్ కథలు చెయ్యడం ఇష్టం లేక తనకు నచ్చిన సబ్జెక్టు కోసం ఎదురుచూసి ప్రస్తుతం “Heza”అనే దిఫ్ఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంగీత దర్శకుడుగా ఆయన తాజా చిత్రం “మామా.. చందమామ”.

Heza సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వ భాధ్యతలతో పాటు సంగీతం కూడా చేసాడు మున్నా కాశీ. పెద్ద సినిమాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా కొత్త కథ, అందుకు తగ్గట్లు మంచి స్క్రీన్ ప్లే , సంగీతం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2019 లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించిన సినిమాల జాబితాలో ఈ సినిమా ఖచ్చితంగా చేరుతుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మౌత్ టాక్ తో, ప్రతిచోటా పాజిటివ్ రివ్యూలతో Heza సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంటోంది. ఇక ఈ సినిమాలో ముమైత్ ఖాన్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటులతో పాటు ఇటీవల బిగ్ బాస్ షో తో పేరు తెచ్చుకున్న నూతన్ నాయుడు , Rx 100 లక్ష్మణ్ వంటి నటులు ఉన్నారు. ఇక గుధాచారి లాంటి సినిమాలకు పనిచేసిన గ్యారీ ఈ మూవీ కి ఎడిటర్. ఇక హీరోగా, డైరెక్టర్ గా రొటీన్, కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక కథను నమ్మి, అందులో ఒక క్యారెక్టర్ లాగా కనిపించోన మున్నా కాశీ ఈ సినిమాతో తనలోని నటుడిని వంద శాతం ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసారు. ఇక సినిమాను చూసిన వాళ్ళు అంత హేజా సినిమాను మరొక కాంచన అంటున్నారు. మున్నా కాశీ గారు ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేసి టాలీవుడ్ లో మరొక విజయ్ అంటోనీ మాదిరి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All