Homeటాప్ స్టోరీస్హేజా మూవీ రివ్యూ

హేజా మూవీ రివ్యూ

హేజా మూవీ రివ్యూ
హేజా మూవీ రివ్యూ

నటీనటులు: మున్నా కాశి, ముమైత్ ఖాన్, తనికెళ్ళ భరణి, నూతన్ నాయుడు
దర్శకత్వం: మున్నా కాశి
సంగీతం: మున్నా కాశి
నిర్మాత: కెవిఎస్ఎన్ మూర్తి, విఎన్ వోలేటి
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2019
రేటింగ్: 2.5/5

పాపులర్ మ్యూజిక్ కంపోజర్ మున్నా కాశి స్వీయ దర్శకత్వంలో హారర్ జోనర్ లో రూపొందిన చిత్రం హేజా. ప్రోమోలతోనే అందరి దృష్టిని ఆకర్షించి ఒక విభిన్నమైన హారర్ థ్రిల్లర్ అనిపించిన హేజా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూ చూడండి.

- Advertisement -

కథ:
వందేళ్ల క్రితం హేజా(ముమైత్ ఖాన్)ను బ్రతికుండాగానే నిప్పంటించి చంపేస్తారు. ఇప్పటి కాలానికి కట్ చేస్తే.. మున్నా (మున్నా కాశి) ఒక సంగీత దర్శకుడు. తన పనులతో బిజీగా, ప్రశాంతంగా గడిపేస్తున్న మున్నా, లిజీ (లిజీ గోపాల్)ను చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకటవుతారు. అయితే పెళ్లి చేసుకున్నాక ఆనందకర జీవితం గడపాలనుకున్న ఇద్దరికీ కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. దీంతో వాళ్ళిద్దరి జీవితాలలో అనుకోని కుదుపులు వస్తాయి. అసలు వీళ్లిద్దరి జీవితంలో వచ్చిన ఇబ్బందులేంటి? వాటి వల్ల ఎదురైన పర్యావసానాలేంటి? ఈ ఇబ్బందులకు, హేజాకు ఏమైనా సంబంధం ఉందా? హేజా వల్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? వాటి నుండి వీళ్ళు బయటపడగలిగారా? అన్నది మిగతా కథ.

నటీనటులు:
మున్నా కాశి ఈ సినిమాలో హీరోగా రాణించాడు. రొమాంటిక్ సీన్స్ లో ఆకట్టుకుంటూనే, అతి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్లుగా నటించాడు. విభిన్న షేడ్స్ ఉన్న ఈ పాత్రను మున్నా కాశి సమర్ధవంతంగా పోషించగలిగాడు. హీరోయిన్ గా లిజీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటనను చూసిన వాళ్ళెవ్వరూ కొత్త హీరోయిన్ అనుకోరు. తనికెళ్ళ భరణికి చాలా కాలం తర్వాత మంచి పాత్ర దక్కింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు తన వంతు న్యాయం చేసాడు. ముమైత్ ఖాన్ కూడా చాలా కాలం తర్వాత సినిమాల్లో మెరిసింది. మిగతావాళ్లంతా తమ తమ పాత్రల మేరకు రాణించారు.

సాంకేతికర వర్గం:
మున్నా కాశి ఎంచుకున్న కథ రెగ్యులర్ హారర్ కథలకు భిన్నంగా ఉంది. దాన్ని మున్నా మలిచిన విధానం గ్రిప్పింగ్ గా ఉండి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలా కాలం తర్వాత నిఖార్సైన హారర్ థ్రిల్లర్ తెలుగు సినిమాల్లో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం మున్నా కాశి. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా మున్నా కాశిని అభినందించాల్సిందే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇచ్చిన రీ రికార్డింగ్ సూపర్బ్ గా వర్కౌట్ అయింది. నాని చమిడిశెట్టి అందించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి. కలరింగ్ కూడా విభిన్నంగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి సినిమా నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలను అభినందించాల్సిందే.

చివరిగా:
హారర్ థ్రిల్లర్స్ అనగానే ఒకలాంటి చీప్ భావన ఈ మధ్యన బాగా ఎక్కువైంది. కేవలం డబ్బుల కోసమే నాలుగు థ్రిల్స్, కామెడీ పెట్టి సినిమా చుట్టేస్తున్నారన్న వాదన బలపడింది. అయితే హేజా వాటికి భిన్నంగా తెరకెక్కిన సినిమా. హారర్ చిత్రాలను చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన సినిమా హేజా. నటీనటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక బలం కలిసి హేజాను బెస్ట్ హారర్ థ్రిల్లెర్స్ లో ఒకటిగా నిలిపాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All