
ఏపీలో కరోనా పేషేంట్‌లకు బెడ్‌లు సరిపోకపోవడంతో రమేష్ చౌదరికి చెందిన హాస్పిటల్ స్వర్ణా ప్యాలెస్‌లో ట్రీట్‌మెంట్ చేస్తోంది. అయితే అందులో ఇటీవల అగ్ని ప్రమాదం జరగడం, అందులో కొంత మంది కరోనా పేషెంట్‌లు మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అధికర పక్షం బలంగా వాదన వినిపిస్తూ నిజ నిర్థారణ కమిటీని వేసింది. కమిటీ ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.
దీంతో రమేష్ హాస్పిటల్స్ అధినేత రమేష్ చౌరి పరారీలో వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనని సపోర్ట్ చేస్తూ హీరో రామ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రిని ఈ సంఘటన విషయంలో ఎవరో కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారితో ఏపీ ముఖ్యమంత్రి జాగ్రత్తగా వుండాలని హీరో రామ్ ట్వీట్ చేశారు. ఇక్కడి నుంచే అసలు రచ్చ మొదలైంది.
అంతటితో ఆగక స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ పేషెంట్ ల బిల్లులని షేర్ చేస్తూ `ఫైర్ + ఫీజు = ఫూల్స్.. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? ఫీజుల వివరణ: మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. ని రామ్ వరుస ట్వీట్‌లు చేశారు. అయితే రమేష్ హాస్పిటల్స్ రమేష్ చౌదరి కోసం రామ్ ఇంతగా బాధపడటానికి కారణం ఆయన రామ్‌కు బంధువు కావడమేనని తెలిసింది. దీంతో నెటిజన్స్ రామ్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకోవడం మొదలుపెట్టారు. `నీకు ఆ రమేష్ హాస్పిటల్ నుండి ఇన్స్పిరేషన్ వచ్చిందో లేక ముడుపులు వాటాలు వచ్చాయో ఆ అక్రమ హాస్పిటల్ దందాలకు నువ్ వకాల్తా తీస్కున్నపుడే అర్థమయ్యింది నీకు ఖచితంగా ఆ పాపపు సొమ్ములో వాటా ఉంటుందని` నెటిజన్స్ రామ్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది.