Homeటాప్ స్టోరీస్విజ‌య్ సేతుప‌తికి మ‌ళ్లీ బెదిరింపులు!

విజ‌య్ సేతుప‌తికి మ‌ళ్లీ బెదిరింపులు!

విజ‌య్ సేతుప‌తికి మ‌ళ్లీ బెదిరింపులు!
విజ‌య్ సేతుప‌తికి మ‌ళ్లీ బెదిరింపులు!

కోలీవుడ్‌లో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన హీరో విజ‌య్ సేతుప‌తి. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ `800` పేరుతో ఓ బ‌యోపిక్ ఇటీవ‌ల మొద‌లైన విష‌యం తెలిసిందే. శ్రీ‌లంక‌న్ క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు.

ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి ఫ‌స్ట్ లుక్‌ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. అప్ప‌టి నుంచి విజ‌య్ సేత‌ప‌తికి ట్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి. అ చిత్రంలో న‌టించ‌కూడ‌ద‌ని, వెంట‌నే త‌ప్పుకోవాల‌ని వేధించ‌డం, విమ‌ర్శించ‌డం మొద‌లైంది. త‌మిళుల‌ని ఊచ‌కోత కోసిన శ్రీ‌లంక‌కు చెందిన క్రికెట‌ర్ బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి వీళ్లేద‌ని, ఆ సినిమా నుంచి త‌ప్పుకోమ‌ని నెటిజ‌న్స్‌తో పాటు త‌మిళ సంఘాలు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు విజ‌య్ సేతుప‌తిని డిమాండ్ చేశారు. ముర‌ళీధ‌ర‌న్ కూడా త‌న బ‌యోపిక్ నుంచి త‌ప్పుకోమ‌ని చెప్పారు. దీంతో త‌ను ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు విజ‌య్ సేతుప‌తి ప్ర‌క‌టించాడు.

- Advertisement -

అయినా అత‌నిపై బెదిరింపులు, విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. ఏ స్థాయికి దిగ‌జారాయంటే ఈ మూవీ నుంచి విజ‌య్ సేతుప‌తి త‌ప్పుకోక‌పోతే అత‌ని మైన‌ర్ బాలిక‌ని రేప్ చేస్తామ‌ని బెదిరింపుల దాకా వెళ్లింది. ఓ ఆక‌తాయి నెటిజ‌న్ విజ‌య్ సేతుప‌తి `800` సినిమా నుంచి త‌ప్పుకోకుంటే అత‌ని మైన‌ర్ కూతుర్ని రేప్ చేస్తామంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజ‌న్స్ ఆక‌తాయిపై భ‌గ్గుమ‌న్నారు. వెంట‌నే అత‌న్ని ఉరితీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత క్రూరంగా కామెంట్ చేసిన వాడిని జైల్లో సెట్టండి అంటూ డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ మండిప‌డుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All