
ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్కీ కృష్ణమూర్తి హిస్టారికల్ నవల ఆధారంగా ఈ చారిత్రక సినిమాని రూపొందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కార్తి, విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి, అదితీరావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అత్యతం పాపులర్ నటీనటులంతా కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం వున్న పరీస్థితుల్లో డిజిటల్ రిలీజ్ సేఫ్ అని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్` చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయమని సదరు సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే లార్జెర్‌దెన్ లైఫ్ సినిమా కావడంతో థియేటర్స్‌లో ముందు రిలీజ్ చేసిన తరువాత ఓటీటీలో రిలీజ్ చేస్తానని మణిరత్నం నెట్‌ఫ్లిక్స్ వారు ఇచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారట.