Homeటాప్ స్టోరీస్కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం

కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం

Nerella victim suicide attempt at ktr తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టించింది . నేరెళ్ల బాధితులు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సభలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసారు అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు కోల హరీష్ అనే వ్యక్తి . హరీష్ తో పాటుగా పెంట బానయ్య ని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న తంగళ్లపల్లి లో జరిగింది . నేరెళ్ల సంఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .

అప్పటి నుండి బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు దాంతో మరోసారి తమ బాధని వ్యక్తం చేయడానికి కేటీఆర్ సభని వినియోగించుకున్నారు బాధితులు . నేరెళ్ల గ్రామం సిరిసిల్ల నియోజకవర్గం లోనిదే కావడం విశేషం . కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . నీతి , న్యాయం గురించి గొంతు చించుకొని మాట్లాడే కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని , అణగదొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు .

- Advertisement -

English Title: Nerella victim suicide attempt at ktr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All