Homeటాప్ స్టోరీస్`నేడే విడుద‌ల‌` ప్రీ లుక్ రిలీజ్‌!

`నేడే విడుద‌ల‌` ప్రీ లుక్ రిలీజ్‌!

`నేడే విడుద‌ల‌` ప్రీ లుక్ రిలీజ్‌!
`నేడే విడుద‌ల‌` ప్రీ లుక్ రిలీజ్‌!

ఐకా ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై అసిఫ్ ఖాన్ , మౌర్యాని హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్న చిత్రం `నేడే విడుద‌ల‌`. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా రామ్‌రెడ్డి ప‌న్నాల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. న‌జురుల్లా ఖాన్‌, మ‌స్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్రీలుక్ టైటిల్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది.

ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మేక‌ర్స్ ఓ వీడియోని విడుద‌ల చేశారు. ఆ వీడియో సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ వీడియోతో మూవీ ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో సినిమా ఫ‌స్ట్ లుక్ తో పాటు ఫ‌స్ట్ సింగిల్‌ని విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్ల‌డించారు.

- Advertisement -

ఆద్యంతం ఆస‌క్తిక‌ర‌మైన క‌థా, క‌థ‌నాల‌తో ఆలోచింప‌జేసే క‌థ‌నంతో ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌ల‌తో త్వ‌ర‌లో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో కాశీవిశ్వ‌నాథ్‌, అప్పాజీ అంబ‌రీష్‌, మాధ‌వి, టి.ఎన్‌.ఆర్‌, అదుర్స్ ఆనంద్‌, పీలా గంగాధ‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్  న‌వీన్‌,
అశోక్ వ‌ర్ధ‌న్‌, ర‌స‌జ్ఞ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అజ‌య్ అర‌సాడ‌, పాట‌లు: శ్రీ‌మ‌ణి, కెమెరా:  సి.హెచ్. మోహ‌న్‌చారి, ఎడిటింగ్‌:  సాయిబాబు త‌లారి, ఫైట్స్: అంజి, ఆర్ట్‌: సి.హెచ్.  ర‌వికుమార్‌, విఎఫ్ ఎక్స్ ఆర్ అంకోజీరావు, నిర్మాత‌లు : న‌జురుల్లా ఖాన్‌, మ‌స్తాన్ ఖాన్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్‌రెడ్డి ప‌న్నాల‌.‌

`నేడే విడుద‌ల‌` ప్రీ లుక్ రిలీజ్‌!
`నేడే విడుద‌ల‌` ప్రీ లుక్ రిలీజ్‌!
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All