Homeటాప్ స్టోరీస్న‌య‌న్‌..విఘ్నేష్‌ల మ‌ధ్య షాకింగ్ సీక్రెట్‌!

న‌య‌న్‌..విఘ్నేష్‌ల మ‌ధ్య షాకింగ్ సీక్రెట్‌!

న‌య‌న్‌..విఘ్నేష్‌ల మ‌ధ్య షాకింగ్ సీక్రెట్‌!
న‌య‌న్‌..విఘ్నేష్‌ల మ‌ధ్య షాకింగ్ సీక్రెట్‌!

న‌య‌న్‌..విఘ్నేష్‌ల మ‌ధ్య సీక్రెట్ వుందా? వుంటే ఏంటా సీక్రెట్ అన్న‌ది చాలా మందిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బుధ‌వారం లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ సీక్రెట్ బ‌య‌ట‌ప‌డింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా జేజేలు అందుకుంటోంది న‌య‌న‌తార‌. హీరోల స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుంటూ మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది.

ఆమె వుంటే చాలు అని న‌య‌న ప్ర‌ధాన పాత్ర‌లో మహిళా ప్ర‌ధాన చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా చిత్రాలతో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క్రేజ్‌ని ద‌క్కించుకుంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లో న‌టిస్తూనే త‌నని వెతుక్కుంటూ వ‌చ్చిన చిత్రాల్లో త‌నే హీరోగా నటిస్తూ సూప‌ర్‌స్టార్స్‌నే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజ్‌ని సొంతం చేసుకున్న న‌య‌న‌తార నేటితో 36వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది.

- Advertisement -

త‌ను ప్రేమిస్తూ డేటింగ్ చేస్తున్న విఘ్నేష్ శివ‌న్‌కు 35 ఏళ్లే. దీంతో ఇద్దరి మ‌ధ్య ఏజ్ గ్యాప్ వుండ‌టం.. అది కూడా న‌య‌న‌తార ఓ ఏడాది పెద్ద‌ది అనే సీక్రెట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా అవాక్క‌వుతున్నారు. ఇదిలా వుంటే త‌న ప్రేయ‌సి పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని అంద‌రికంటే ముందే పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల్ని తెలియ‌జేశాడు విఘ్నేష్ శివ‌న్‌. అర్థ్ర‌రాత్రి సిర‌గ్గా 12 గంట‌ల‌కు న‌య‌న‌తార‌కు బ‌ర్త్‌డే విషెస్‌ని తెలియ‌జేశాడు. ఇన్ స్టాలో న‌య‌న‌తార ఫొటోని షేర్ చేశాడు. లాస్ ఏజిల్స్‌లోని శాంటా మోనికా పీర్ వ‌ద్ద న‌య‌న‌తార ఫొటోల‌కు పోజులిచ్చిన ఫొటో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by nayanthara? (@nayantharaaa)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All