Homeటాప్ స్టోరీస్న‌య‌న‌తార వెడ్డింగ్ డేట్ చెప్ప‌బోతోందా?

న‌య‌న‌తార వెడ్డింగ్ డేట్ చెప్ప‌బోతోందా?

న‌య‌న‌తార వెడ్డింగ్ డేట్ చెప్ప‌బోతోందా?
న‌య‌న‌తార వెడ్డింగ్ డేట్ చెప్ప‌బోతోందా?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార త‌న పెళ్లి డేట్‌ని చెప్ప‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా యంగ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివ‌న్‌తో డేటింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జోడీ పెళ్లికి రెడీ అవుతోంది. గ‌త కొన్ని నెల‌లుగా దోశ నివార‌ణ కోసం త‌మిళ‌నాడులోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో ప్ర‌త్యేకంగా న‌వ‌గ్ర‌హ దోశ నివార‌ణ పూజలు నిర్వ‌హించారు.

దీంతో త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని కొంత మంది, లేదు లేదు సీక్రెట్‌గా పెళ్లి జ‌రిగిపోయింద‌ని కొంత మంది చెప్పుకొచ్చారు. డేటింగ్‌కి బోర్ కొట్టిన‌ప్పుడే పెళ్లి చేసుకుంటామ‌ని విగ్నేష్ ఆ త‌రువాత షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో వీరిద్ద‌రి పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్టే అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇటీవ‌ల న‌య‌న‌తార త‌న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని సోష‌ల్ మీడియా బ‌య‌ట‌పెట్ట‌డం, విగ్నేష్‌ కూడా త‌న జీవితంలో రింగులో బంది అయిపోయింద‌ని పోస్ట్ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార త‌న పెళ్లి డేట్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఇటీవ‌ల ఎంగేజ్‌మెంట్ పూర్తి కావ‌డంతో ఈ జంట పెళ్లికి రెడీ అయిపోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఇద్ద‌రూ క‌లిసి పెళ్లి డేట్‌ని, పెళ్లికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించ‌బోతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All