Homeటాప్ స్టోరీస్ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్‌!

ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్‌!

నారా రోహిత్ న్యూ మేకోవ‌ర్‌!
నారా రోహిత్ న్యూ మేకోవ‌ర్‌!

బాణం` చిత్రంతో త‌న సీని ప్రస్థానాన్ని ప్రారంభించారు హీరో నారా రోహిత్‌. ఆయ‌న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ల‌వుతోంది. బాణం, సోలో, ప్ర‌తినిథి, జ్యో అచ్యుతానంద‌, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు వంటి విభిన్న చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. నారా రోహిత్ న‌టించిన తొలి చిత్రం `బాణం` 2009 సెప్టెంబ‌ర్ 16న విడుద‌లైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తొలి షాట్‌ని మాత్రం మే 5న తీశార‌ట‌.

నారా రోహిత్ తొలి సారి ట్విట్ట‌ర్ లోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా `బాణం` తొలి రోజు తొలి షాట్‌కు సంబంధించిన ఫొటోని షేర్ చేసిన నారా రోహిత్ ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. `2009లో స‌రిగ్గా ఇదే రోజు నేను న‌టించిన `బాణం` తొలి షాట్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఈ సంద‌ర్భంగా నా గురువు, పెద‌నాన్న చంద్ర‌బాబు నాయుడు, నా ప్రియ‌మైన నారా లోకేష్ అన్న‌తో క‌లిసి ట్విట్ట‌ర్‌లోకి ప్ర‌వేశించ‌డం గౌర‌వంగా వుంది` అని ట్వీట్ చేశారు.

- Advertisement -

నారా రోహిత్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు ఏడాదిన్న‌ర కావస్తోంది. శ్రీ‌విష్ణు, సుధీర్‌బాబుతో క‌లిసి ఆయ‌న న‌టించిన చిత్రం `వీర‌భోగ‌వ‌సంత‌రాయ‌లు`. ఈ సినిమా త‌రువాత నారా రోహిత్ నుంచి మ‌రో చిత్రం రాలేదు. తాజాగా మేకోవ‌ర్ మార్చిన ఆయ‌న ఇక‌పై కొత్త త‌ర‌హా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకుంటున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All