Homeటాప్ స్టోరీస్గ్యాంగ్ లీడర్ ఫైనల్ రన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

గ్యాంగ్ లీడర్ ఫైనల్ రన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

గ్యాంగ్ లీడర్ ఫైనల్ రన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
గ్యాంగ్ లీడర్ ఫైనల్ రన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ ఫుల్ రన్ కంప్లీట్ చేసుకుంది. సినిమా విడుదలై 50 రోజులు కూడా అవ్వకుండానే ప్రైమ్ లోకి రావడంతో ఆడుతున్న అరకొర థియేటర్లలో కూడా ఈ చిత్రాన్ని తొలగించారు. రివెంజ్ కథను కామెడీ టచ్ తో చెప్పే ప్రయత్నంగా గ్యాంగ్ లీడర్ తెరకెక్కింది. వివిధ వయసుల్లో ఉన్న ఐదుగురు ఆడవాళ్లు కలిసి ఒకడ్ని చంపాలని చూస్తారు. ఈ రివెంజ్ కు క్రైమ్ థ్రిల్లర్ కథలు రాసుకునే పెన్సిల్ పార్థసారథి ఏ విధంగా సహాయపడ్డాడు అన్నది సినిమా కథ.

కథ వినడానికి బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ ను డీల్ చేసిన విధానం సరిగ్గా లేకపోవడంతో బోల్తా కొట్టింది. ఈ చిత్రానికి రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి. తొలి వీకెండ్ వసూళ్లు బానే ఉన్నా తర్వాతి నుండి మౌత్ టాక్ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై పడింది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీగా బిజినెస్ జరిగింది. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రాన్ని భారీ రేట్లకే అమ్మారు. మొత్తంగా గ్యాంగ్ లీడర్ 30 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే సినిమా హిట్ అనిపించుకోవాలంటే 30 కోట్లు వసూలు చేయాలి. కానీ గ్యాంగ్ లీడర్ తన ఫుల్ రన్ లో 20 కోట్లు దాటి ముగించింది. అంటే దాదాపుగా 10 కోట్లు పైన నష్టం వాటిల్లింది. నైజాం, సీడెడ్ లో చెరో 2 కోట్లు నష్టపోయిన ఈ చిత్రానికి అతి పెద్ద షాక్ ఓవర్సీస్ నుండి వచ్చింది. సాధారణంగా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న నాని ఈ చిత్రాన్ని మాత్రం గట్టెక్కించలేకపోయాడు. యూఎస్ లో ఈ సినిమా సగానికి సగం నష్టపోయింది.

- Advertisement -

విడుదలైన ప్రతీ చోటా ఎంతో కొంత నష్టాలను మూటగట్టుకున్న గ్యాంగ్ లీడర్ చివరికి ప్లాప్ ముద్ర వేయించుకుంది. నాని నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ బానే ఉన్నాయి అని టాక్ వస్తున్నా కానీ కలెక్షన్స్ సాధించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే చిత్రంలో నెగటివ్ ఛాయలున్న పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి రావాలని నాని ఆశిస్తున్నాడు.

మరోవైపు విక్రమ్ కుమార్ మనం తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. 24, హలో ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఇలా ఏ సినిమా అయినా నష్టాలనే తీసుకొస్తోంది. దర్శకుడిగా మంచి టేస్ట్ ఉన్న విక్రమ్ కుమార్ కు ఇలా జరగడం దురదృష్టకరమే. ప్లాపుల నుండి బయటపడడానికి విక్రమ్ కుమార్ ఈసారి ఎలాంటి ప్రయత్నం చేస్తాడో చూడాలి.

గ్యాంగ్ లీడర్ ఫుల్ రన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

ప్రాంతం బిజినెస్ షేర్ (కోట్లలో)

నైజాం 8.00 6.48

సీడెడ్ 3.60 1.66

ఈస్ట్ 1.60 1.32

వెస్ట్ 1.20 0.98

ఉత్తరాంధ్ర 2.50 2.26

కృష్ణ 1.45 1.20

గుంటూర్ 1.80 1.31

నెల్లూర్ 0.75 0.54

ఆంధ్ర + తెలంగాణ 22 15.75

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 0.73

కర్ణాటక 1.50 1.39

ఓవర్సీస్ 6.00 3.06

మొత్తం 30 20.93

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All